ఎన్టీఆర్ దేవర చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నది. బాలీవుడ్ లో కూడా ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ ,కరణ్ జోహార్, ఆలియా భట్  తో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ కూడా చేశారు. అయితే గతంలో ఎన్టీఆర్ ,అలియా భట్ ఇద్దరు కూడా rrr చిత్రంలో నటించడం జరిగింది. అప్పటినుంచి తెలుగు ప్రేక్షకులకు కూడా ఆలియాభట్ నచ్చడమే కాకుండా ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలకు కూడా మంచి బాండింగ్ ఏర్పడింది.



దేవర సినిమా మరో మూడు రోజులలో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో బాలీవుడ్ లో ఎన్టీఆర్ వరుసగా ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నారు. ఈ సమయంలోనే ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, ఆలియా భట్, ఎన్టీఆర్ లతో ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూని చేశారు. అలియాభట్ నటించిన జిగ్ర అనే సినిమా కూడా అక్టోబర్ 11న విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ రెండు చిత్రాలకు కలిపి ఒకేసారి ఒక భారీ ఇంటర్వ్యూ ని ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్టుగానే ఒక వీడియోని కూడా యూట్యూబ్లో రిలీజ్ చేశారు చిత్ర బృందం.


ఈ వీడియోలో ఆలియా భట్ దేవర సినిమాలోని చుట్ట మల్లే సాంగ్ ని తెలుగులో పాడి మరి  అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇది తన ఫేవరెట్ సాంగ్ అంటూ కూడా ఎన్టీఆర్ ముందు ఇమే చాలా అద్భుతంగా పాడడం జరిగింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈమె పాటకి ఫిదా అయ్యామంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం..RRR సినిమా లో ఏర్పడిన బాండింగ్ వల్ల ఎన్టీఆర్ పైన ప్రేమ ఆలియా భట్ కు తగ్గలేదని అందుకే ఇలా తెలుగులో పాడి సడన్ సర్ప్రైజ్ ఇచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆలియా అభిమానులు మాత్రం ఆలియా సూపర్ సింగర్ అని  తెలుగులో కూడా  అద్భుతంగా పాడింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో తెలుగులో కూడా నటిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: