ప్రభుత్వం ఏర్పాటై ఇటీవల 100 రోజులు పూర్తయ్యాయి. ఇంకా పవన్ ఫ్రీ కాలేదు. ఆయన ఎప్పుడు అందుబాటులోకి వస్తారు, పెండింగ్‌లో ఉన్న సినిమాల్లో దేంట్లో ముందు జాయిన్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాని కొద్ది రోజులు పక్కన పెట్టే అవకాశం ఉంది. హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాల షూటింగ్‌ల్లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండు మూవీ టీమ్స్ బాగా యాక్టివ్ అయిపోయాయి.
పవన్ ఎప్పుడు ఏ సినిమా కంప్లీట్ చేస్తారా అనేది ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ రెండు చిత్రాలు మాత్రం త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదల కావాలని ప్రయత్నిస్తున్నాయి. ముందు తమ సినిమానే పూర్తవుతుంది, విడుదలవుతుంది అనే 'ఓజీ' టీమ్ మేకర్స్ భావిస్తున్నారు. మార్చి నెలాఖరులోగా రిలీజ్ డేట్ షెడ్యూల్ చేయాలని కూడా చూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసే సమయంలోనే విడుదల తేదీని ప్రకటించుదామని భావిస్తున్నారు. కానీ 'హరి హర వీరమల్లు' మూవీ టీమ్ మార్చి 28న తమ చిత్రాన్ని విడుదల చేస్తామని అనౌన్స్ చేసింది.
ఇంకా ఆ సినిమా షూటింగ్ పూర్తికాలేదు. అయినా త్వరలోనే సినిమా రిలీజ్ చేస్తామని చెప్పడాన్ని బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ డేట్స్ మొత్తం వీరే తీసేసుకునే లాగా ఉన్నారు. అందుకే 'ఓజీ' మూవీ మేకర్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 'హరిహర వీరమల్లు' షూటింగ్ చేయాల్సిన సీన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. 'ఓజీ'లో మిగిలిన సీన్లు తక్కువే. పవన్ కొద్దిరోజులు కేటాయిస్తే చాలు ఈ షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఓజీ సినిమాకే హైప్ ఎక్కువగా ఉంది. అది హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందుకే తమ సినిమాని ముందుగా రిలీజ్ చేయాలని అప్పుడే 'హరిహర వీరమల్లు' మూవీ కూడా మంచి హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని ఆ సినిమా మేకర్స్ అనుకుంటున్నారు. ఇలా పవన్ సినిమాల నిర్మాతల మధ్య తీవ్ర అసంతృప్తి ఇబ్బందికర వాతావరణ నెలకొన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.