టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటలలో రామ్ పోతినేని ఒకరు. ఈయన దేవదాసు అనే మూవీ తో కెరియర్ను ప్రారంభించాడు. ఈ మూవీతోనే మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు. ఆ తర్వాత కూడా ఈయన ఎక్కువ శాతం లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలలో నటిస్తూ మంచి విజయాలను అందుకుంటూ వచ్చాడు. ఈ మధ్యకాలంలో కూడా ఈయన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలలో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. కొంత కాలం క్రితం ఈయన నటించిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ అయినటువంటి ఈస్మార్ట్ శంకర్ మూవీ మంచి విజయం అందుకుంది.

మూవీ తర్వాత ఈయన ది వారియర్ అనే పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. ఈ సినిమా తర్వాత రామ్ , బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్కంద అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. బారి అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ఈస్మార్ట్ శంకర్ మూవీ కి కొనసాగింపుగా తాజాగా పూరి జగన్నాథ్ , రామ్ హీరోగా డబల్ ఇస్మార్ట్ అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించాడు.

మూవీ ఘోర పరాజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంది. ఇలా ఇస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత వరుసగా మూడు అపజయాలను రామ్ అందుకున్నాడు. ఇకనైనా ఈయన కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీల జోలికి పోకుండా తనకు అచ్చోచ్చిన రొమాంటిక్ సినిమాలలో హీరోగా నటిస్తే బెటర్ అని చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రామ్ ఇప్పటికైనా తన రూట్ మార్చి డిఫరెంట్ కాన్సెప్ట్ లతో రూపొందే సినిమాలలో నటిస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: