ఐతే దేవర సినిమా ఫలితం చూసి కచ్చితంగా ఆడియన్స్ మైండ్ సెట్ ఎలా ఉంది. ఏది యాక్సెప్ట్ చేస్తున్నారు. ఏది రిజెక్ట్ చేస్తున్నారు అన్నది తెలుసుకుని దాన్ని పుష్ప 2 కి అప్లై చేయాలని చూస్తున్నాడట సుకుమార్. ఇది ఓ రకంగా మంచిదే కానీ దేవర కథ వేరు. పుష్ప 2 కథ వేరు అనుకునే ఛాన్స్ ఉంది. ఐతే రెండిటిలో హీరో మాస్ రోల్ కాబట్టి కచ్చితంగా వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
దేవర సినిమా విషయంలో కొరటాల శివ ఎలాగైతే ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేశాడో దానికి మించి పుష్ప 2 లో అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రని రాసుకున్నాడట సుకుమార్. ఆల్రెడీ పుష్ప 1 సూపర్ హిట్ కాబట్టి అతని క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐతే సినిమా వచ్చి 3 ఏళ్లు అవుతుంది కాబట్టి మరీ లేట్ చేస్తే పుష్ప ని ఆడియన్స్ మర్చిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా పుష్ప 2 కి ఈ సినిమాల ఫీడ్ బ్యాక్ ముందు చూపు చూసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. పుష్ప 2 సినిమాను డిసెంబర్ 6న రిలీజ్ లాక్ చేశారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడ తగ్గకుండా ఈ సినిమా నిర్మిస్తున్నారు.