యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి ఇప్పటి వరకు సోలో సినిమా రాలేదు.అరవింద సమేత చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఏకైక సినిమా ఆర్ ఆర్ ఆర్ మాత్రమే.ఈ సినిమా తర్వాత ఆయన కొరటాల శివ తో కలిసి దేవర చిత్రం చేశాడు. దేవర సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఆచార్య వంటి ఘోరమైన డిజాస్టర్ టాక్ తర్వాత కొరటాల శివ ఎంతో కసితో చేస్తున్న చిత్రం ఇది.హాలీవుడ్ టెక్నీషియన్స్ తో పాటుగా , ఫైట్ మాస్టర్స్ మరియు కెమెరామెన్స్ ఈ సినిమా కోసం  చేస్తున్నారు.ఈ చిత్రం లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పాటలు, ట్రైలర్ అందరిలో భారీ అంచనాలను పెంచాయి.ఈ నేపథ్యంలో సినిమా కథ పెద్దది కాబట్టి, రెండు భాగాల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా డైరెక్టర్ కొరటాల శివ ప్రకటించిన సంగతి తెలిసిందే.ముఖ్యంగా ఈ సినిమా లో వచ్చే అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఇప్పటి వరకు ఎవరూ చూడని విధంగా ఉంటాయట.ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా క్లైమాక్స్ కి అలాగే బాహుబలి క్లైమాక్స్ కి చాలా దగ్గర పోలికలు ఉంటాయని లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్.బాహుబలి క్లైమాక్స్ లో కట్టప్ప బాహుబలి కి వెన్నుపోటు పొడిచి ఎలా అయితే చంపేసి ఊహించని ట్విస్ట్ ఇస్తారో, దేవర చిత్రం లో కూడా అలాంటి ట్విస్ట్ ఉండబోతుందట.

ఈ ట్విస్ట్ చూసిన తర్వాత దేవర పార్ట్ 2 కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తుందని అంటున్నారు.ఆ రేంజ్ లో ప్లాన్ చేసాడట డైరెక్టర్ కొరటాల శివ.ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో ని ఎలా చూపిస్తే అభిమానులతో పాటుగా ఆడియన్స్ కూడా విజిల్స్ వేస్తారో, అలా చూపించే ప్రయత్నం చేస్తున్నాడట డైరెక్టర్ కొరటాల శివ.మరి ఆయన ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి.ఇదిలావుండగాదేవర సినిమాలో జాన్వీ కపూర్‌ను చూసేందుకు వేచిచూడాల్సిందేనని రత్నవేలు హింట్ ఇచ్చారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ ఎంట్రీ సెకండాఫ్‍లో ఉంటుందని వెల్లడించారు.ఈ మూవీలో దేవర క్యారెక్టర్ పవర్‌ఫుల్‍గా ఉంటుందని, అయితే థియేటర్ల నుంచి బయటికి వచ్చేటప్పుడు వర పాత్రే ఎక్కువగా గుర్తుంటుందని కూడా రత్నవేలు తెలిపారు. దీంతో భారీ ట్విస్ట్ ఉండనుందనే అంచనాలు వస్తున్నాయి. ఈ మూవీలో దేవర, వర అనే తండ్రీకొడుకులుగా డ్యుయల్ రోల్ చేశారు ఎన్టీఆర్. ‘క్లైమాక్స్’లో తదుపరి పార్ట్ కు సంబంధించిన ట్విస్ట్, సస్పెన్స్ ఉంటుందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రత్నవేలు వెల్లడించారు. “బాహుబలి 1 లాగానే దేవర క్లైమాక్స్ ప్రేక్షకులపై బలమైన, మరిచిపోలేని ప్రభావాన్ని చూపిస్తుంది” అని రత్నవేలు చెప్పారు. దీంతో దేవర క్లైమాక్స్ ఏమై ఉంటుందనే హైప్ మరింత పెరిగిపోయింది.బాహుబలి రేంజ్ లో వర్కౌట్ అయితే, దేవర గట్టెక్కినట్లే.ఇక ఈ ట్విస్ట్ ల కోసం మూడు రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: