ఇప్పటి వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకు సంబంధించి 400 వందలకు పైగా బెనిఫిట్ షోలు ఏర్పాటుచేయడంతో ఆ బెనిఫ్ట్ షోలకు సంబంధించిన టిక్కెట్లు హాట్ కేక్ ల్లా అమ్మకం జరుగుతూ ఉండటంతో 26వ తారీఖు అర్థరాత్రి నుండి ‘దేవర’ కలక్షన్స్ అరాచకం మొదలుకానున్నది. దీనితో 27వ తారీఖు తెల్లవారే సరికి ఈ మూవీ ఫలితం అందరికీ తెలిసిపోయే ఆస్కారం ఉంది.
అయితే ఇక్కడ ఒక ప్రమాదం ‘దేవర’ కు పొంచి ఉంది అన్న హెచ్చరికలు వస్తున్నాయి. ఈసినిమాకు టోటల్ పాజిటివ్ టాక్ వస్తే ఫర్వాలేదు కానీ టాక్ లో ఏమాత్రం తేడా కనిపించినా ఈమూవీ పై జూనియర్ వ్యతిరేకులు పనికట్టుకుని సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది అన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి.
ఒకసారి ఇలాంటి భారీ సినిమాలకు డివైడ్ టాక్ వస్తే ఆ టాక్ ను తట్టుకుని సినిమా కలక్షన్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేయడం కష్ట సాధ్యమైన పని అవుతుంది. ఈసినిమాకు సంబంధించి ఒక ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ధియేటర్లలో కోటి రూపాయలు గ్రాస్ దాటవచ్చు అన్న అంచనాలు ఉన్నాయి. 10 వేల జనాభా కలిగిన ఒక చిన్న పల్లెటూరులో కూడ ‘దేవర’ సినిమా విడుదల అవ్వుతూ ఉండటం షాకింగ్ గా మారింది. ఈసినిమాకు సంబంధించి మొదటిరోజు అన్ని షోలకు టిక్కెట్లు చాల వేగంగా బుకింగ్ జరుగుతోంది..