ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం జెమిలి ఎలక్షన్లు జరిపించాలి అని గట్టి పట్టుదలతో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1951 లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో నుంచి 1967 వ సంవత్సరంలో జరిగిన నాలుగవ సార్వత్రిక ఎన్నికల వరకు దేశంలో జమిలి ఎన్నికల పద్ధతి కొనసాగింది. ఇక 1972 వ సంవత్సరం జరగవలసిన ఐదవ సార్వత్రిక ఎన్నికలు 1971 వ సంవత్సరం జరగడంతో ఇండియాలో జెమిలి ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది. ఇక జెమిలి ఎలక్షన్స్ అంటే దేశంలో అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలను ఒకే సారి జరిపించినట్లయితే దానిని జెమిలి ఎలక్షన్స్ అంటారు. 1971 వ సంవత్సరం ఆగిపోయిన ఈ పద్ధతిని మళ్లీ పునరుద్ధరించాలి అని దేశం మొత్తం ఒకే సారి అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలను జరిపించాలి అని బీజేపీ ప్రభుత్వం గత కొంత కాలంగా గట్టి ప్రయత్నాలు చేస్తూ వస్తుంది.

ఇక ఇలా జెమిలి ఎలక్షన్లను జరిపించడం వల్ల ఎన్నికల ఖర్చులు భారీ ఎత్తున తగ్గించవచ్చు అని కేంద్ర ప్రభుత్వం సూచనలు చేస్తూ వస్తుంది. అయితే జెమిలి ఎన్నికల పద్ధతి అమల్లోకి వచ్చినట్లయితే ప్రధాన రాజకీయ నాయకులకు ఒక విషయంలో భారీ ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. అసలు విషయంలోకి వెళితే... దాదాపుగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయాలలో ప్రధాన నాయకులు ఒక అసెంబ్లీ స్థానం నుండి కాకుండా , రెండు అసెంబ్లీ స్థానాల నుండి కూడా పోటీ చేస్తూ ఉంటారు. అలాగే కొంత మంది నాయకులు ఒక పార్లమెంటు స్థానం నుండి కాకుండా రెండు పార్లమెంట్ స్థానాల నుండి పోటీ చేస్తూ ఉంటారు.

ఒక వేళ రెండిటిలో గెలిచినట్లయితే ఒక దాంట్లో రాజీనామా చేసి మరొక దాంట్లో కొనసాగుతూ ఉంటారు. ఇక రాజీనామా చేసిన స్థానంలో మళ్ళీ ఎలక్షన్లను నిర్వహిస్తూ ఉంటారు. జెమిలి ఎన్నికల పద్ధతిలో ఇలాంటివి ఉండవు. కచ్చితంగా ఎవరైనా నాయకుడు కేవలం ఒకే స్థానం నుండి పోటీ చేయవలసి ఉంటుంది. రెండవ స్థానం నుండి పోటీ చేయడం గెలిస్తే దానిని రాజీనామా చేసి అక్కడ మళ్ళీ ఎలక్షన్లను నిర్వహించే సిస్టమ్ ఉండదు. జెమిలి ఎన్నికల పద్ధతి ద్వారా ఎన్నికల వ్యయాన్ని తగ్గించడం ప్రధాన ఉద్దేశం. ఆ పద్ధతి అమల్లోకి వచ్చినట్లు అయితే ప్రధాన నాయకులకు ఈ వెసులుబాటు లేకుండా పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: