ఇప్పటికే 7 సీజన్స్ ని ఎంతో విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న తెలుగు బిగ్ బాస్ షో.. ఇక ఇప్పుడు ఎనిమిదవ సీజన్ ప్రసారమవుతుంది అన్న విషయం తెలిసిందే. ఎప్పటిలాగానే ఈ షో ప్రారంభమయ్యాక అన్ని వర్గాల ఆడియన్స్ ని కూడా తన వైపుకు తిప్పుకుంది. ప్రస్తుతం తెలుగు బులితర ప్రేక్షకులందరూ కూడా ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా బిగ్ బాస్ ని ఫాలో అవుతూ ఉన్నారు. ఇక ఎప్పటిలాగానే నామినేషన్స్, బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు ఎలిమినేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి.



 వారాంతంలో నాగార్జున రావడం శనివారం అందరికీ క్లాస్ పీకడం.. ఆదివారం కాస్త ఫన్ జనరేట్ చేసి చివర్లో ఒకరిని ఎలిమినేట్ చేయడం కామన్ గానే జరుగుతుంది. అయితే ప్రతి సీజన్లో కూడా నాగార్జున ఒకరికి సపోర్ట్ చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తూ ఉంటాయి. ఇక ఈ సీజన్లో కూడా నాగార్జున సోనియాకు సపోర్ట్ చేస్తున్నాడని వాదనలు కాస్త బలంగానే వినిపిస్తున్నాయి. హౌస్ లోనే కాదు బయట ఆడియన్స్ లో కూడా సోనియా పై వ్యతిరేకత ఉంది. కానీ అటు నాగార్జున మాత్రం ఆమెపై సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నాడు. రెండో వారం నాగార్జున వచ్చినప్పుడు సోనియాకు రెడ్ కార్డు చూపిస్తారని అందరూ ఊహించారు. దీనికి కారణం విష్ణు ప్రియ పై ఆమె చేసిన కామెంట్స్. కానీ నాగార్జున అలా చేయలేదు. ఇక మూడో వారం కూడా అంతే సంచాలక్ గా ఫెయిల్ అయిన ఆమెనే వెనకేసుకొచ్చాడు. దీంతో సోనియా కూడా రెచ్చిపోతుంది. పృథ్వి, నిఖిల్ లను తన వెంట తిప్పుకుంటుంది. దీంతో సోనియాతో నాగార్జునకు మధ్య బంధం ఏముంది. ఆమెకు వర్మ హీరోయిన్ అనే పేరు ఉండడం.. ఇక రాంగోపాల్ వర్మ నాగర్జునకు ఫేవరెట్ డైరెక్టర్ కావడం వల్లే ఆమెను సేవ్ చేస్తూ వస్తున్నాడా అంటూ అందరూ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: