టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ మాస్ క్రేజ్ ఉన్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు . ఈయన తాజాగా దేవర అనే సినిమాలో హీరోగా నటించాడు . ఈ మూవీ సెప్టెంబర్ 27 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది . కొరటాల శివ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా లో బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా , హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ చాలా పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహించింది. ఈ సినిమా యూనిట్ కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాలోని ఆయుధ పూజ సాంగ్ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ఈ మూవీ దర్శకుడు కొరటాల శివ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాలోని ఆయుధ పూజ సాంగ్ హైలెట్ గా ఉండబోతుంది అని తెలియజేశాడు.

అలాగే ఈ సాంగ్ కోసం ఎంతో కష్టపడ్డాం. ఈ సాంగ్ ముందే చిత్రీకరిద్దాం అనుకున్నాం. సినిమా స్టార్ట్ చేసినప్పుడే ఈ సన్నివేశాలను స్టార్ట్ చేశాం. కానీ ఈ సాంగ్ స్థాయి చాలా పెద్దది. ఇందులో అనేక మంది నటులు ఉంటారు. వాళ్లందరి కాంబినేషన్ సెట్ కావడం , అంత పెద్ద సీను చిత్రీకరించడం చాలా కష్టం అయ్యింది. దానితో మొదట తీద్దాం అనుకొని మొదలు పెట్టిన ఈ సాంగ్ అసలు పూర్తి కాలేదు. ఇక సినిమా ఈ సాంగ్ తోనే పూర్తి అయ్యింది అని కొరటాల శివ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: