టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా మరో రెండు రోజులలో బాక్సాఫీస్ భ‌ర‌తం పట్టేందుకు రెడీ అవుతోంది. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దేవర సినిమా కోసం జన జాతర అప్పుడే మొదలైపోయింది. ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా ఐదు పాన్ ఇండియా భాషలలో దేవర రిలీజ్ అవుతుంది. అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడు కూడా థియేటర్లకు పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. గురువారం అర్ధరాత్రి దాటాక.. ఒంటిగంట నుంచి దేవర బెనిఫిట్ షోలు ఎక్కడ ఎక్కడ పడనున్నాయి.. దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సోలో సినిమా కావడంతో.. దేవరపై అంచనాలు ఆకాశాన్ని అందుకునే రేంజ్ లో ఉన్నాయి.


ఇక ఈ సినిమాలోని కథ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్లలో చాలాసార్లు చెప్పారు. ఈ సినిమా రన్ టైం విషయంలో రకరకాల వార్తలకు వచ్చాయి. అధికారికంగా చిత్ర యూనిట్ కూడా దేవర లెన్దీ రన్ టైంతో వస్తుందని ముందే చెప్పారు. అయితే సినిమా అసలు లెంగ్త్ ఎంత అనేది ఇప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. దేవర టోటల్ రన్ టైం 2 గంటల 50 నిమిషాల 58 సెకండ్లుగా లాక్ అయ్యింది. అయితే ఇందులో సామాజిక భద్రతకు సంబంధించిన వార్నింగ్ యాడ్స్ కూడా కలిపారు.


అవి కాకుండా కేవలం దేవర సినిమా రన్ టైం మాత్రం చూసుకుంటే 2 గంటల 42 నిమిషాలుగా ఉందని తెలుస్తోంది. అంటే దేవర సినిమా టోటల్ రన్‌ టైం 170 నిమిషాలు. ఉంటే 8 నిమిషాల ప్రకటనలు మినహాయిస్తే కేవలం దేవర సినిమా రన్ టైం 162 నిమిషాలుగా ఉంటుందని తెలుస్తోంది. ఏది ఏమైనా 162 నిమిషాల రన్ టైమ్ తో వస్తున్న దేవర రెండు భాగాలుగా రానుంది. మరి ఫస్ట్ పార్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేష‌న‌ల్ రికార్డ్ క్రియేట్ చేస్తుంది.. సినిమాకు ఎలాంటి టాక్ వస్తుంది.. అనేది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: