కొన్ని సినిమాల కథలను కొంత మంది దర్శకులు ఒక హీరోతో చేయాలి అని చెప్పిన సందర్భంలో ఆల్మోస్ట్ ఆ హీరో కూడా ఆ సినిమాను ఓకే చేశాక వేరే హీరోలు ఆ సినిమా కథను విని దానిని వారు చేయాలి అనుకోవడం , అలా అనుకున్న సందర్భలలో ఒకరితో దర్శకుడు చేయాలి అనుకున్న ఆ తర్వాత కొన్ని పరిణామాల వల్ల ఆ సినిమా వేరే వాళ్ళతో తెరకెక్కిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇకపోతే ఇలాంటి సందర్భం రవితేజ కెరియర్లో కూడా ఒకటి జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం శ్రీను వైట్ల , రవితేజ తో ఓ సినిమా చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా రవితేజకు ఓకే కథను కూడా వివరించాడట.

కథ మొత్తం విన్న రవితేజకు అది అద్భుతంగా నచ్చిందట. సినిమా దాదాపు అద్భుతమైన విజయం సాధిస్తుంది అని నమ్మకానికి కూడా వచ్చాడట. అలా ఆల్మోస్ట్ రవితేజ , శ్రీను వైట్ల కాంబోలో మూవీ సెట్ అయిన తర్వాత అదే కథను ఒక సందర్భంలో మోహన్ బాబు విన్నాడట. ఇక మోహన్ బాబు కు ఆ కథ సూపర్ గా నచ్చడంతో , శ్రీను వైట్ల ను మోహన్ బాబు ఇది తన కుమారుడు అయినటువంటి మంచు విష్ణు తో చేయాలి అని కోరాడట  దానితో శ్రీను వైట్ల ఓకే సార్ కాకపోతే రవితేజకు నేను ఈ కథ చెప్పాను. ఆయనను ఒకసారి అడగండి అన్నాడట.

దానితో మోహన్ బాబు , రవితేజను సంప్రదించగా ఆయన ఒకే సారి చేయండి అన్నాడట. అలా చేతులు మారిన సినిమానే డీ మూవీ అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా మంచు విష్ణు కెరియర్ లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన డీ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించగా , శ్రీహరి , జెనీలియాకు అన్న పాత్రలో నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: