ఇకపోతే ఈ విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోవడం లేదని , ఊర్మిళా మాత్రమే తన భర్త నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుందని , అందుకు గల కారణం మాత్రం తెలియరాలేదు అని సమాచారం. వీరి ప్రేమ , పెళ్లి విషయానికి వస్తే 2014లో ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా మేనకోడలు పెళ్ళిలో మోసిన్, ఊర్మిళ పరిచయమయ్యారట. కొద్దిరోజుల్లోనే వీరి పరిచయం ప్రేమగా మారి 2017లో కాశ్మీర్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఈ మోసిన అత్తర్ ను ఆమె వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈమె వయసు 50 సంవత్సరాలు.
సినిమాలలో తనదైన ముద్ర వేసుకున్న ఈమె రాజకీయాల్లో కూడా 2019 కాంగ్రెస్ లో చేరి ముంబై నార్త్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2020లో శివసేన పార్టీలో చేరింది. ఈమె భర్త కూడా నటుడే. 21 ఏళ్ల వయసులోనే కాశ్మీర్ నుంచి ముంబై వచ్చి పలు సినిమాలలో నటించారు. ఇక ఊర్మిళా నటించిన తెలుగు చిత్రాల విషయానికి వస్తే.. అంతం, ఓ భార్య కథ, అనగనగా ఒకరోజు, గాయం వంటి చిత్రాలలో నటించింది.