ఇక అక్కడినుండే అసలు సినిమా కధలు స్టార్ట్ అయ్యాయి. రీసెంట్ టైమ్స్‌లో నార్సింగి ఠాణా సినిమా వాళ్ళ లవ్ బ్రేకప్ ఇష్యూలకు కూడా స్పాట్‌గా మారడం కొసమెరుపు. వాటిల్లో మేజర్ కేసులు సినిమా వాళ్లకు చెందినవే అని సదరు పోలీసులు నవ్వుకొని మరీ గుసగుసలాడుకుంటున్న పరిస్థితి వచ్చింది పాపం సినిమా వారికి. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా హర్షసాయిపై కూడా రేప్ కేసు ఫైలయింది ఇక్కడే. ఇక జానీ మాస్టర్ రేప్ కేసు గురించి ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆ వేడి ఇంకా తగ్గనే లేదు. లావణ్య - రాజ్ తరుణ్ వివాదం అయితే సినిమాను మించిపోయే రీతిలో ఇక్కడ హల్ చల్ చేసింది. రాజ్ తరుణ్ తనను మోసం చేశారంటూ నార్సింగి పీఎస్‌లో లావణ్య ఫిర్యాదు చేసిన సంగతి విదితమే.
ఇక జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని.. 16 ఏళ్ల పడుచు ప్రాయంలోనే తన యవ్వనాన్ని జానీ దోచుకున్నాడని వాపోయింది తోటి డాన్సర్ స్రష్టి. తన మాట గాని వినకపోతే ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేస్తానని బెదరించాడంటూ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ స్రష్టి 40 పేజీల్లో తన ఆవేదనను వెళ్లగక్కింది. దాంతో కట్ చేస్తే, గోవాలో జానీ మాస్టర్ పోలీసులకు చిక్కాడు.. ఇదే క్రమంలో 14 రోజుల రిమాండ్ పడడం తెలిసిందే. ఇక బిగ్‌బాష్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ కేసు అయితే అప్పట్లో సంచలనం రేపింది. ఆ కేసును డీల్ చేసింది కూడా నార్సింగి పోలీసులే. అదేం చిత్ర విచిత్రమో కానీ లా అండ్ ఆర్డర్ కేసులకన్నా ఇట్టాంటి కేసులకు నార్సింగ్ పీఎస్ కేరాఫ్‌గా మారిందనే టాక్ ఇపుడు భాగ్యనగరంలో ఘోషిస్తోంది.