ఇకపోతే ఎన్నో సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఎనిమిదో సీజన్‌ను నిర్వహకులు మొదలెట్టారు. ఎన్నో అంచనాల నడుమ మొదలైన ఈ సీజన్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందనే వస్తోంది. ముఖ్యంగా ఇందులో ఓటింగ్ గతంలో కంటే విభిన్నంగా ఇపుడు సాగుతోంది. ఈ నేపథ్యంలో 4వ వారంలో ఎవరికి ఎక్కువ, ఎవరికి తక్కువ ఓట్లు వస్తున్నాయో? అన్న విషయం పైన చాలా ఆసక్తికరమైన విషయాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుత షోలో మునిపటిలా కాకుండా కొత్త కంటెంట్‌ను చూపిస్తూ ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారు కంటెస్టెంట్స్. యష్మి గౌడ, ప్రేరణ కంభం, కిర్రాక్ సీత, బెజవాడ బేబక్క, ఢీ ఫేం నైనిక, సోనియా ఆకుల, విష్ణుప్రియ భీమనేని, పృథ్వీరాజ్, నబీల్ అఫ్రిది, నిఖిల్, ఆదిత్య ఓం, నాగ మణికంఠ, అభయ్ నవీన్, శేఖర్ భాషలు కంటెస్టెంట్లుగా ఎంటర్ కాగా తొలి వారం బెజవాడ బేబక్క, రెండో వారంలో శేఖర్ బాషా, మూడో వారంలో అభయ్ షో నుంచి ఎలిమినేట్ అయిన సంగతి విదితమే.
ఇక నాలుగో వారంలో కూడా నామినేషన్స్ ఉత్కంఠగానే సాగాయి అని చెప్పుకోవచ్చు. మొత్తంగా నబీల్, సోనియా ఆకుల, పృథ్వీరాజ్ శెట్టి, నాగ మణికంఠ, ఆదిత్య ఓం, ప్రేరణ, నైనికలు నామినేట్ కాగా చీఫ్ నిఖిల్‌కు బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్‌తో నైనికను సేవ్ చేయడం జరిగింది. దాంతో ఓటింగ్‌కు ఆరుగురు మాత్రం మిగిలారు. ఈ క్రమంలో ఈ నాలుగో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రాసెస్ సోమవారం రాత్రి నుంచే ప్రారంభం కాగా... ఎవరూ ఊహించని విధంగా నబీల్ అఫ్రిదీ ఒక్కడే దాదాపు 40 శాతం వరకూ ఓటింగ్ సాధించగా, సోనియా ఆకుల కేవలం 8 శాతం ఓటింగ్ మాత్రమే నమోదు చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే కంటిన్యూ అయితే సోనియా ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.