ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. దేవర సినిమా టికెట్ల పెంపు పైన కీలక ఆదేశాలు చేసింది ఏపీ హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ టికెట్ల పెంపును... పది రోజులకు కుదిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి దేవర సినిమా విషయంలో చంద్రబాబు సర్కార్ ధరలు పెంచుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. 14 రోజులపాటు టికెట్ ధరలు పెంచుకొని... సినిమా నడిపించుకోవచ్చని చంద్రబాబు సర్కార్.. రెండు రోజుల కిందట ప్రకటన చేసింది.
అయితే దీనిపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్ పై బుధవారం రోజున ఏపీ హైకోర్టు విచారణ చేసి.... దేవర నిర్మాతలకు షాక్ ఇచ్చింది. కేవలం పది రోజుల వరకు మాత్రమే దేవరాజ్ సినిమా టికెట్ల ధరలను పెంచుకోవాలని.. స్పష్టం చేసింది హైకోర్టు. దీంతో దేవర సినిమాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది. ఇక ఇటు తెలంగాణ రాష్ట్రంలో టికెట్ ధరలను పెంచుకోవచ్చని... రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇది ఇలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీన అంటే ఎల్లుండి రిలీజ్ కానుంది. దాదాపు 5 భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో.. ఆన్లైన్లో టికెట్ ధరలు బుక్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. టికెట్ బుకింగ్ విషయంలో కూడా... రికార్డు నమోదు చేస్తోంది జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా. ఇక సినిమా రిలీజ్ అయ్యాక.. ఎన్ని రికార్డులు బద్దలు అవుతాయో అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.