ఎన్టీఆర్ దేవర చిత్రంలో జాన్వీ హీరోయిన్గా నటిస్తున్నది.. మొదటిసారి సౌత్ సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్న నేపథ్యంలో అది కూడా పాన్ ఇండియా సినిమా కావడం చేత అలాగే స్టార్ హీరో ఎన్టీఆర్ కావడం చేత ఈ ముద్దుగుమ్మకు ఈ సినిమా పైన భారీగానే ఆశలు ఉన్నాయి. జాన్వీ కపూర్ తో పాటుగా ఇందులో మరొక మరాఠి హీరోయిన్ శృతి మరాఠీ కూడా నటిస్తున్నది. ఈమె హిందీ సీరియల్స్ లోనే నటించి మంచి పాపులారిటీ అందుకున్నది



దేవర చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్స్ లో కనిపించబోతున్నారు. ఇందులో ఒకరికి జోడీగా జాన్వీ, మరొకరి పాత్రకు జోడిగా శృతి నటిస్తోందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ పాత్రకు పరిచయం లేని అమ్మాయిని తీసుకురన్నారనే విధంగా వార్తలు వినిపించాయి. కానీ ఈ సినిమాలు ఈమె పాత్ర చాలా హైలైట్ గా ఉంటుందని అది కూడా అదరగొట్టేసేలా ఉంటుందనే విధంగా ఇటీవల ఇంటర్వ్యూలో కొరటాల శివ తెలియజేసినట్లు సమాచారం. దేవర -1 లో జాన్వీ గ్లామర్ పాత్రతో అదరగొట్టేసిన ఈ ముద్దుగుమ్మతో పోలిస్తే శృతి మరాఠీ నిడివి కాస్త  తక్కువగా ఉంటుందని ఈమె పాత్ర ఉన్నంతసేపు సినిమా  అదిరిపోతుందని సమాచారం.


ముఖ్యంగా ఈ సినిమాలో ఈమె పాత్రలకు పర్ఫెక్ట్ క్యాస్టింగ్ జరిగినట్లుగా ఇటీవల కొరటాల శివ తెలియజేశారు. తన నటనతో ఈమె అందరిని ఆశ్చర్య పరుస్తుందని కూడా తెలియజేసింది. ఇటీవల దేవర సినిమాలో నటించడం కూడా తనకు ఆనందంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా శృతి మరాఠీ అభిమానులతో పంచుకుంది. అందుకు సంబంధించిన రెండు స్టిల్స్ ని కూడా షేర్ చేస్తూ అందులో ఒకటి ఓల్డ్, మరొకటి యంగ్ లుక్కులో కనిపించింది శృతి మరాటి. అయితే ఇన్ని రోజులు బాలీవుడ్ ఆడియన్స్ ని అలరించిన శృతి మరాఠీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. మరి అన్నట్టుగానే ఈమె పాత్ర అభిమానులను ఆకట్టుకుంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: