ఆదివారం నిర్వహించాల్సిన జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కోసం ఎంతో ఆత్రుతగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు.. తీవ్ర నిరాశ ఎదురయింది. హైదరాబాదులోని ఓ ప్రముఖ హోటల్లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసింది చిత్రబృందం. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ విపరీతంగా వస్తారని... అంచనా వేయలేకపోయిన రేవంత్ రెడ్డి సర్కార్... భద్రత సిబ్బందిని ఎక్కువగా ఏర్పాటు చేయలేకపోయింది.
దీంతో... ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగకుండానే... రద్దయింది. అయితే ఈవెంట్ పై తాజాగా కేటీఆర్ స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడంలో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయిందని మండిపడ్డారు. ఆ మాత్రం సోయి లేకుండా రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరించడం దారుణం అన్నారు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లు కూడా నిర్వహించడం చేతకాకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఉందని నిలదీశారు.
ఈ విషయంలో పోలీసులు చేతులెత్తేసారని కూడా మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో ఏ సినిమా ఫంక్షన్ అయినా చాలా సమర్థవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని రంగాల్లో అట్టర్ ఫ్లాఫ్ అవుతుందని... ఇలాంటి ప్రభుత్వం మనకెందుకు అని ప్రశ్నించారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన దేవర ఫ్రీ రిలీజ్.. ఈవెంట్ రద్దు కావడంతో... ఆ చిత్ర బృందానికి భారీగానే నష్టం వాటిల్లింది. ఇక ఈ సినిమా ఎల్లుండి థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.