ట్రెండ్ అనే పదాన్ని సృష్టించింది సినిమా వాళ్ళే అని చెప్పుకోవచ్చు. సినిమా వాళ్లు ఏం చేసినా జనాలు అనుసరిస్తూ ఉంటారు. అందుకే కొన్ని బడా కంపెనీలు వారి ఉత్పత్తులు అమ్ముకునేందుకు బ్రాండ్ అంబాసిడర్లుగా పెద్దపెద్ద సూపర్ స్టార్ లను నియమించుకొని, వారికి కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తూ ఉంటారు. ఇక డబ్బులకి ఆశపడి వారు కూడా సోకాల్డ్ ప్రొడక్ట్ జనాలకి మేలు చేస్తుందా? కీడు చేస్తుందా? విజ్ఞత లేకుండా తెగ ప్రచారాలు ఇచ్చేస్తూ ఉంటారు. ఇక బుర్ర తక్కువ అభిమానులు, ప్రేక్షకులు అనబడే వారు ఆయా ప్రొడక్ట్స్ ను కొన్ని ఇల్లు గుల్ల చేసుకుంటూ ఉంటారు. ఏ ఒక్కరో ఇద్దరో ఇక్కడ బాధ్యతగా ఉంటారు తప్పితే ఎక్కువ శాతం డబ్బులు కోసం బతుకుతున్నవారే!

ఈ కాక చెందినదే టాటూ. టాటూ వేసుకునే కల్చర్ సినిమా వాళ్ళనుండే వచ్చింది. మరీ ముఖ్యంగా సినిమా హీరోయిన్లు నుండే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే జనాలు వేలం వెర్రిగా తమ శరీరం పైన హాని జరుగుతుందని తెలిసినా... టాటూలు వేయించుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా నగరాల్లో నివసించేటువంటి యువతి యువకులు టాటూల మాయలో బతుకుతూ ఉంటారు. ఒకరిని మించి మరొకరు టాటూలు వేసుకుంటూ ఉంటారు. అమ్మాయిలైతే ఎక్కడపడితే అక్కడ టాటూలు వేసుకుని రచ్చ చేస్తూ ఉంటారు.

టాలీవుడ్ హీరోయిన్లు అయినటువంటి సమంత, రష్మిక, త్రిష, నయనతారలు ఎక్కడెక్కడ టాటూలు వేసుకుంటారో అందరికీ తెలిసిందే. అలాంటి వారిని చూసి ప్రస్తుత జనరేషన్ కూడా టాటూ వేసుకోవడం అనేది ఒక ట్రెండ్ అని ఫీల్ అవుతూ మరి టాటూ వేసుకుంటూ ఉంటారు. అయితే ఆయా టాటూలు మన హీరోయిన్లు... వారి ప్రియుల ప్రేమకి గుర్తుగా వేసుకున్నట్టు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే వారి ప్రియులతో వారు ఎంతకాలం కలిసి ఉన్నారు అందరికీ తెలిసిందే. అది అసలు విషయం... కాబట్టి నేటితరం ఇలాంటి విపరీత పోకడలకు పోవడం మానేస్తేనే మంచిది!

మరింత సమాచారం తెలుసుకోండి: