తెలుగు చలన చిత్ర సీమ పురుడు పోసుకున్న తర్వాత ఎంతో మంది తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇక మొదటి తరంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లలా మెలిగారు. ఆ తర్వాత తరంలో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు టాలీవుడ్ త్రిమూర్తులుగా చక్రం తిప్పారు. తెలుగు సినిమా అనగానే ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు గుర్తొస్తారు.1922 నుండి 2022 వరకు ఈ వంద సంవత్సరాల్లో వెండితెర మీద ఓ వెలుగు వెలిగిన ధృవతారలు.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ పంచభూతాలు ఈ అయిదుగురు. 2022 సంవత్సరం చిత్ర పరిశ్రమ కృష్ణంరాజు, కృష్ణ లాంటి ఇద్దరు లెజెండరీ యాక్టర్లను కోల్పోయింది. వీరి మరణంతో ఓ శకం ముగిసిపోయింది. ప్రేక్షకులు ఇక తెలుగు సినిమా పెద్ద దిక్కుల్ని, పాత తరాన్ని చరిత్రలో చదువుకోవాల్సిందే.. సినిమాలలో చూసుకోవాల్సిందే.. ఈ సందర్భంగా ఎవరు ఎన్నెళ్లపాటు నటులుగా కొనసాగారు?ఎన్ని చిత్రాల్లో నటించారు వంటి వివరాలు చూస్తే..N.T. రామారావు 44 ఏళ్ల కెరీర్ – 300 సినిమాలు.అక్కినేని నాగేశ్వర రావు 72 ఏళ్ల కెరీర్ – 255 సినిమాలు.శోభన్ బాబు 37 సంవత్సరాలు – 230 సినిమాలు.కృష్ణంరాజు 55 ఏళ్లు – 190 సినిమాలు.కృష్ణ 50 ఏళ్లు – 350 సినిమాలు చేసారు.వీళ్లు అయిదుగురూ కలిపితే 200 ఏళ్ళకు పైగా యాక్టివ్ క్యుములేటివ్ కెరీర్, 1325 సినిమాలు.. అంటే యావరేజ్‌గా ఏడాదికి ఆరు సినిమాలు..అంటే రోజుకి రెండు షిఫ్టులు చొప్పున పనిచేస్తే కానీ పూర్తికానంత పని..

ఈ మహానటులు ఎటెంప్ట్ చేయని జానర్ లేదు.. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, డ్రామా, కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ, యాక్షన్, హారర్.. అన్నీ చేశారు.. తమ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు కూడా ప్రయోగాలు చేయడానికి వెనుకాడలేదు.ఒకపక్కన అభిమానులు పోస్టర్ల మీద భీకరమైన పేడ యుధ్ధాలు చేసుకుంటూ ఉన్న సమయంలోనూ మల్టీస్టారర్స్ చేశారు.. ఏ సీజీలూ లేని ఆర్గానిక్ ఫైట్లూ, డాన్సులూ చేశారు.అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు భాషకున్న ప్రత్యేకమైన స్థానాన్ని పదిలంగా కాపాడారు.. జాతికి విపత్తు వొచ్చినప్పుడు అందరూ ఒక్కటై, అందరినీ ఒక్క తాటిమీదికి తీసుకొచ్చి జోలెపట్టి విరాళాలు సేకరించారు.ఉద్యమాలు చేశారు, రాజకీయాల్లో పాల్గొన్నారు. పదవులు చేపట్టారు, పద్మశ్రీలు సంపాదించుకున్నారు.ఈ తరంవెళ్ళిపోయింది.2022లో కృష్ణంరాజు, కృష్ణ ఇద్దరూ మరణించడంతో ఒక శకం ముగిసిపోయింది.

ఈరోజు తెలుగు సినీ అభిమాని ప్రతి ఒక్కరూ వీళ్ళందరికీ నివాళిగా ఒక్క కన్నీటిబొట్టు రాల్చాల్సిన సమయం.. అందరినీ గుర్తు తెచ్చుకుని గుండెల్లోని అభిమానాన్ని పెదాల మీదికి తెచ్చుకుని హాయిగా ఓ చిరునవ్వు నవ్వాల్సిన సమయం ఇది.ఈ నేపథ్యంలో ల్యాబ్ దగ్గర రిలీజుకి ముందు..రోజుల తరబడి జరిగే ప్రింటింగు ప్రాసెస్సులు, వందలకొద్దీ ప్రింట్లు, వేలకొద్దీ రీలు బాక్సులు, బస్తాలతో కలెక్షన్ల క్యాషు తీసుకొచ్చి బ్యాంకుల్లో గుట్టగా పోసే డిస్ట్రిబ్యూటర్లు, రీలు బాక్సులు పట్టుకుని పరుగులు తీసే థియేటరు కుర్రాళ్ళు, టికెట్ కౌంటర్ల దగ్గర చొక్కాలు చిరిగిపోయి, మోచేతులు డోక్కుపోయేంతగా ముష్టియుధ్ధాలు.. హీరో ఎంట్రీలకు చిరిగిపోయే స్క్రీన్లు, ఈలల సౌండుకి పగిలిపోయే స్పీకర్లు, యాభై అడుగుల ఎత్తులో భారీ కటౌట్లు, పదిరూపాయల టికెటు వందకి అమ్ముడుపోయేంత బ్లాక్ ఫీవర్, శతదినోత్సవాలు, సిల్వర్ జూబిలీలు, యేడాదికి పైగా ఆడిన ప్లాటినం జూబిలీలు, లక్షలకు పైగా అమ్ముడుపోయే ఆడియో క్యాసెట్లు, డైలాగు డ్రామాలు. ఇదిలావుండగా భార‌తీయ సినిమా 110 సంవ‌త్స‌రాల సుదీర్ఘ మ‌నుగ‌డ‌తో అసాధార‌ణంగా ఎదిగింది. నేడు 1000 కోట్ల వ‌సూళ్ల క్ల‌బ్ సాధ్య‌మ‌వుతోంది. వెయ్యి కోట్లు అంత‌కుమించిన వ‌సూళ్ల క్ల‌బ్ లో అర‌డ‌జ‌ను మంది భార‌తీయ‌ హీరోలు ఉన్నారు. అంచెలంచెలుగా పెరిగిన బ‌డ్జెట్లు, టైమ్ ఫ్రేమ్, మేకింగ్ క్వాలిటీ, టెక్నాలజీ ..ఇలా అన్ని కోణాల్లోను ఎదుగుద‌ల క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: