నాగచైతన్య,శోభిత ఎంగేజ్మెంట్ అభిమానులు  ఎక్స్పెక్ట్ చేయలేదు.. ఆగస్టు 9వ తేదీన వీరి ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా సింపుల్ గా కుటుంబ సభ్యుల స్నేహితుల మధ్యనే జరిగింది. ఆ తర్వాత ఈ విషయం పైన అటు నాగ చైతన్య కానీ శోభిత కానీ ఎక్కడ మాట్లాడలేదు. ఇప్పుడు తాజాగా శోభిత  కొన్ని విషయాల పైన స్పందించింది. ముఖ్యంగా తెలుగు సాంప్రదాయాలను పాటించడం అలాగే నాగచైతన్యతో నిశ్చితార్థం తల్లి కావాలనుకోవడం అంశాలను హైలెట్ చేస్తూ మాట్లాడింది. వాటి గురించి చూద్దాం.


నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ విషయం పైన.. మాట్లాడుతూ తాను ఎలా జరగాలి అనుకున్నానో అలాగే జరిగిందని.. చాలా సింపుల్ గానే అయింది అయితే ఇలాంటివి తాను సింపుల్ గా అయ్యిందా గ్రాండ్  గా అయ్యిందనే విషయాన్ని పట్టించుకోనట్టు తెలిసింది. తాను ఎన్నో కలలు అంచనాలు ప్లానింగ్ తో ఈ క్షణం కోసం ఎదురు చూడలేదు.. కేవలం అప్పటి క్షణాన్ని మాత్రమే ఆస్వాదించాను చాలా రిలాక్స్ గా స్వీట్ గా సింపుల్ గా ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటూ తెలిపింది. అందమైన విషయాలు జరుగుతున్నప్పుడు తనకు ఎలాంటి అలంకరణలు అవసరం లేవని కూడా తాను భావిస్తానని తెలిపింది.


వివాహం చేసుకొని పిల్లలను కన్నట్లుగా ఊహించుకునే దాన్ని అంటూ తెలిపింది.. ఇలాంటివి జరిగినప్పుడు తాను చాలా సాంప్రదాయంగానే కనిపిస్తానంటూ వాటిని కచ్చితంగా పాటిస్తానంటూ తెలిపింది.. పరిపూర్ణమైన అమ్మతనాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను.. వివాహం పైన కూడా తనకి చాలా స్పష్టతతోనే ఉండేదట.. పెళ్లి సమయంలో ఖచ్చితంగా తెలుగుతనం ఉట్టిపడేలా ఉండాలని.. తన తల్లిదండ్రుల సాంప్రదాయం తన మూలాలను ఎప్పుడూ కూడా తాను మరువనంటూ తెలిపింది శోభిత. ముఖ్యంగా పెళ్లికి తాను కూడా చాలా సాంప్రదాయమైన చీరనే కట్టుకుంటానని.. పెళ్లిలో అమ్మాయిలు ఎర్రటి అంచు కలిగి తెలుపు రంగు పట్టుచీర కట్టుకుంటారని తాను కూడా అదే ప్లాన్ చేస్తున్నాను అంటూ తెలిపింది శోభిత.

మరింత సమాచారం తెలుసుకోండి: