టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించాడు. ఎన్నో సినిమాలను వదులుకున్నాడు. అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను కూడా అందుకున్నాయి. ఆ సినిమాలు కనుక పవన్ కళ్యాణ్ చేసి ఉంటే ఆయన స్థాయి మరింత గొప్పగా ఉండేది. మరి పవన్ కళ్యాణ్ వదులుకున్న బ్లాక్ బాస్టర్ మూవీలు ఏవో తెలుసుకుందాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , పూరి జగన్నాథ్ కాంబినేషన్లో కొన్ని సంవత్సరాల క్రితం బద్రి అనే మూవీ వచ్చింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇకపోతే ఈ మూవీ తర్వాత పూరి జగన్నాథ్ , పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయడానికి చాలా ప్రయత్నాలు చేసినట్లు అందులో భాగంగా కొన్ని కథలను కూడా ఆయనకు వివరించినట్లు పూరి జగన్నాథ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. పూరి జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... పవన్ కళ్యాణ్ కు ఇడియట్ , అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి ,  పోకిరి మూడు సినిమాల కథలను చెప్పాను. చెప్పినప్పుడు బాగా ఎంజాయ్ చేశాడు. కానీ ఆ తర్వాత ఎందుకో ఆ సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు అని చెప్పాడు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి , పవన్ కళ్యాణ్ హీరోగా విక్రమార్కుడు మూవీ ని చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా సినిమా కథను కూడా వివరించాడట. 

కథ మొత్తం విన్న పవన్ కళ్యాణ్ కథ సూపర్ గా ఉంది , బ్లాక్ బస్టర్ అవుతుంది. కాకపోతే నేను ఇప్పుడు సినిమాలు చేయాలి అనుకోవడం లేదు. ఒక రెండు సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. మీరు ఈ కథతో వేరే వారితో సినిమా చేయండి అని చెప్పాడట. దానితో రాజమౌళి అదే కథను రవితేజకు చెప్పడం , ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. ఇలా పవన్ తన కెరీర్ లో ఇడియట్ , అమ్మానాన్న తమిళ అమ్మాయి , పోకిరి , విక్రమార్కుడు లాంటి నాలుగు బ్లాక్ బాస్టర్ మూవీలను వదిలేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: