* టాలీవుడ్ లో  తిరుగులేని  దర్శకుడుగా కొరటాల శివ  
* ఆచార్య మినహా అన్ని సినిమాలు సక్సెస్
* ఆచార్యతో డీలపడ్డ కొరటాల శివ
* దేవరతో బౌన్స్ బ్యాక్ అంటున్న దర్శకుడు


 

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు సక్సెస్ కావడం అలాగే అట్టర్ ప్లాఫ్ చాలా సాధారణం. సినిమా హిట్ అయింది అంటే.. ఆ దర్శకుడు పాపులర్ అవుతూ ఉంటాడు. అదే సినిమా ఫ్లాప్ అయితే...  ఆ దర్శకుడి మొఖం కూడా చూడరు. అదే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సక్సెస్ దర్శకులు ఉన్నప్పటికీ..  కొరటాల శివ రూటే సపరేటు. ఆయన ఏ సినిమా తీసినా... సమాజ సేవ ను దృష్టిలో పెట్టుకొని చేస్తారు.


 అదే తరహాలో ఆయన చేసిన సినిమాలన్నీ.. బంపర్ హిట్ లో అయ్యాయి. భద్ర నుంచి మొదలుకొని.. ఇప్పటి దేవర వరకు అన్ని...జనాల్లో మంచి మార్పు తీసుకువచ్చేందుకే ఉన్నాయి.శ్రీమంతుడు,  భరత్ అనే నేను, మిర్చి, జనతా గ్యారేజ్ ఈ సినిమాలు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చినవే. ఈ సినిమాలు హిట్లు కావడంతో... టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా కొరటాల శివ  రికార్డు లోకి ఎక్కారు.

వ్యవసాయం, చెట్ల పెంపకం, ముఖ్యమంత్రి యువకుడు అయితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ ల పైన సినిమాలు చేశారు కొరటాల శివ. ఈ సినిమాలన్నీ బంపర్ హిట్ అందుకున్నాయి. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా కూడా చేశారు కొరటాల శివ. ఈ సినిమా ఒక గ్రామం అలాగే గనుల గురించి తీయడం జరిగింది. సినిమా కాన్సెప్ట్ అంతా బాగున్నా కూడా.. కొంచెం తేడా జరిగింది.

దీంతో మెగాస్టార్ చిరంజీవి అలాగే కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ఆచార్య సినిమా అట్టర్ ప్లాప్ కావడం... మనం చూసాం. ఆ సినిమాకు జరిగిన తప్పిదాలను... గుర్తించి.. దేవర సినిమా చేశారు కొరటాల శివ. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఎలాంటి.. కాన్సెప్ట్ నచ్చుతుందో.. అదే తరహాలో ముందుకు.. వచ్చారు కొరటాల శివ. జనతా గ్యారేజ్.. ఇప్పటికే ఎన్టీఆర్ తో తీసిన కొరటాల శివ.. దానికన్నా మంచి కథతో ఇప్పుడు దేవర తీశారు. అయితే ఈ సినిమాను రెండు పార్టుల్లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాతో మళ్లీ కొరటాల శివ బౌన్స్ బ్యాక్ అవుతారని అందరూ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: