* ఆరేళ్ల తర్వాత దేవరతో వస్తున్న ఎన్టీఆర్
* సోలోగా అరవింద సమేత సినిమాతో ఎన్టీఆర్ సందడి
* rrr సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా  క్రేజ్
* డిజాస్టర్ డైరెక్టర్ తో బరిలోకి ఎన్టీఆర్

 

టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ అంతా కాదు. నందమూరి కుటుంబంలో... బాలకృష్ణ తర్వాత జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న క్రేజ్ మరే హీరోకు లేదు. అంతలా జూనియర్ ఎన్టీఆర్ ప్రొజెక్ట్ అయ్యారు అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో ముందుకు వస్తున్నారు. శుక్రవారం రోజున... థియేటర్లో దండయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు జూనియర్ ఎన్టీఆర్.


 కొరటాల శివ దర్శకత్వంలో.. జూనియర్ ఎన్టీఆర్.. దేవర సినిమా తీశారు. ఈ సినిమాతో బాలీవుడ్ అలనాటి హీరోయిన్ శ్రీదేవి కూతురు...  జాన్వి కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. దీంతో ఈ సినిమా పైన అందరికీ ఆసక్తి నెలకొంది. దానికి తోడు ఆరు సంవత్సరాల తర్వాత సోలోగా జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారు. 2018 సంవత్సరంలో అరవింద సమేత సినిమాతో తెలుగు ప్రేక్షకులను.. అలరించారు జూనియర్ ఎన్టీఆర్.

 ఈ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో రాగా.. పూర్తిగా ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ లో తీశారు. ఈ సినిమా అప్పట్లో మంచి రికార్డులను నమోదు చేసింది. ఇక ఆ తర్వాత... జక్కన్న దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్  సినిమా చేసి పాన్ ఇండియా హీరోగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమాలో రామ్ చరణ్ తోపాటు.. ఎన్టీఆర్ నటించి క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ సినిమాలో.. కొమురం భీం  పాత్రలో తెలంగాణ యాస భాషలో అద్భుతంగా నటించారు ఎన్టీఆర్.

 అలాగే ఇప్పుడు బాలీవుడ్ లోని... వార్ సినిమా కూడా చేస్తున్నారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ది అతిథి పాత్ర అని సమాచారం. అంటే.. అరవింద సమేత తర్వాత దేవర సినిమాతోనే సోలోగా వస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. దానికి తోడు కొరటాల శివతో.. సినిమా చేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మరింత నమ్మకం  వచ్చింది. మరి ఆరు సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: