మరికొన్ని గంటల్లో దేవర సినిమా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా దేవర మూవీని కచ్చితంగా చూడటానికి పది కారణాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. దేవర మూవీ విడుదలైతే బాక్సాఫీస్ షేక్ కావడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు 130 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండే ఛాన్స్ అయితే ఉంది.
 
* దాదాపుగా ఆరేళ్ల తర్వాత తారక్ సోలో హీరోగా నటిస్తున్న మూవీ కావడంతో పాటు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో దేవర తెరకెక్కిన సినిమా కావడంతో ఫ్యాన్స్ కు ఈ సినిమా ప్రత్యేకమని చెప్పవచ్చు.
 
* దాదాపుగా 40 నిమిషాల పాటు అండర్ వాటర్ సీక్వెన్స్ లతో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాకు సొరచేపతో ఫైట్ సీక్వెన్స్ హైలెట్ గా నిలవనుంది. గ్రాఫిక్స్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించడం పక్కా అని చెప్పవచ్చు
 
* స్టార్ హీరోలు మాస్ సినిమాలకు దూరమవుతున్న తరుణంలో యాక్షన్ ప్రియులకు విందు భోజనంలా దేవర తెరకెక్కింది.
 
* తెలుగు నేటివిటీకి, ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఇచ్చిన దేవర సినిమాలో పాటలు అద్భుతంగా ఉండగా బీజీఎం సినిమాకు హైలెట్ గా నిలవనుంది.
 
* గేమ్ ఆఫ్ థ్రోన్స్ తరహాలో ట్విస్టులు దేవర సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
* కొరటాల శివ ఆచార్య సినిమాతో నిరాశపరిచినా అద్భుతమైన మెసేజ్ తో తెరకెక్కించిన సినిమా దేవర కావడం గమనార్హం. కొరటాల ఫ్యాన్స్ ఈ సినిమాతో కొరటాలకు పూర్వ వైభవం వస్తుందని భావిస్తున్నారు.
 
* దేవర, వర పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు గూస్ బంప్స్ వచ్చేలా ఉండగా ఎన్టీఆర్ తండ్రీకొడుకుల పాత్రల్లో నటించిన మూడో సినిమా దేవర కావడం గమనార్హం.
 
* ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి శృతి మరాఠే, జాన్వీ కపూర్ పరిచయం కానుండగా వీళ్లిద్దరి కెరీర్ కు ఈ సినిమా కీలకం కానుందని చెప్పవచ్చు. జాన్వీ గ్లామర్, శృతి యాక్టింగ్ కోసం దేవర సినిమాను చూడవచ్చు.
 
* విదేశాల్లో సైతం రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ అవుతూ అక్కడి ప్రేక్షకులకు సైతం విడుదలకు ముందే దేవర ఆసక్తిని పెంచేసింది.
 
* యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ కోసం ఈ సినిమాను ఎన్నిసార్లైనా చూడవచ్చని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: