* దేవర పై ఫ్యాన్స్ లో ఊహించని అంచనాలు

* 6 ఏళ్ల తరువాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న హై ఓల్టేజ్  యాక్షన్ మూవీ

* దేవరతో ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయి రికార్డ్స్ బద్దలు కొడతాడా..?



మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. సోలో హీరోగా ఈ పేరును స్క్రీన్ మీద చూసి దాదాపు 6 సంవత్సరాలు అయింది.. ఎన్టీఆర్ నటించిన “అరవింద సమేత” తరువాత రాజమౌళి జైలులోకి వెళ్లారు.. దాదాపు మూడేళ్ల గ్యాప్ తరువాత ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఆ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. హాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్స్ సైతం ఎన్టీఆర్, రాంచరణ్ ల నటనకు ఫిదా అయిపోయారు..ఎన్టీఆర్ కి రాజమౌళికి వున్న ప్రత్యేక అనుబంధం గురించి చెప్పాల్సిన పని లేదు.. ఆ రిలేషన్ తో రాజమౌళి ఎన్టీఆర్ కోసం ఆర్ఆర్ఆర్ లో అద్భుతమైన సీన్స్ రాసుకున్నారు.. ప్రత్యేకంగా ఎన్టీఆర్ కి ఎలివేషన్ ఇచ్చే సీన్స్ అయితే అరాచకం అని చెప్పాలి..రాంచరణ్, ఎన్టీఆర్ యాక్టింగ్ రాజమౌళి డైరెక్షన్, కీరవాణి మ్యూజిక్ ‘ఆర్ఆర్ఆర్’ ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లాయి.. ఏకంగా ఆస్కార్ అవార్డు సైతం అందుకోవడంతో ఇండియన్ సినీ చరిత్రలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రత్యేక చిత్రంగా నిలిచిపోయింది.. దీనితో ఈ సినిమాలో నటించిన రాంచరణ్,ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయి నటులుగా గుర్తింపు పొందారు..అయితే ఇంతటి ఘనవిజయం సాధించినా కూడా ఎన్టీఆర్ అభిమానులకు ఒకటే లోటు.. ఎన్టీఆర్ సోలో హీరోగా ఆ రేంజ్ హిట్ అందుకోవాలని కోరుకున్నారు..


అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ తన తరువాత సినిమాకు డైరెక్టర్ గా ఎంచుకున్నారు.. కానీ ఆచార్య వంటి కెరీర్ బెస్ట్ ప్లాప్ ని అందుకున్న కొరటాలను చూసి ఫ్యాన్స్ భయపడ్డారు.. కానీ ఎన్టీఆర్ మాత్రం ఆ రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆయన రాసుకున్న కథను నమ్మారు.. అందుకే తొందరపడి హడావుడిగా కాకుండా ఫ్యాన్స్ కి బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చేందుకు ఇన్నాళ్లు తెగ కష్ట పడ్డారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'దేవర' ఈ నెల 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. దీనితో చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్ చేస్తుంది.. అయితే ఈ ప్రమోషన్స్ లో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.. ఎన్టీఆర్ నటించిన దేవర  ఇండియా లో 5 భాషలలో విడుదల అవుతుంది..ఈ 5 భాషలలో ఒక్క మలయాళంలో తప్ప తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ వంటి నాలుగు భాషల్లో ఎన్టీఆర్ ఓన్ గా డబ్బింగ్ చెప్పారు.. ఎన్టీఆర్ లో వున్న ఈ మల్టీ టాలెంట్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. ఎన్టీఆర్ కి ప్రతి ఇండస్ట్రీ లో సెపెరేట్ ఫ్యాన్ బేస్ వుంది.. ఆయన సినిమాలని ఎంతో ఇష్టపడే ఫ్యాన్స్ చాలా మంది వున్నారు.. ఎన్టీఆర్ వాయిస్ లో వచ్చే ఆ వైబ్రేషన్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది. అందుకే ఎన్టీఆర్ అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పారు.. దేవర లో ఎన్టీఆర్ డైలాగ్స్, స్టెప్స్,యాక్టింగ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది..

మరింత సమాచారం తెలుసుకోండి: