స్టార్ హీరోల దగ్గరికి కొన్ని అద్భుతమైన కథలు వచ్చినా కూడా వారి ఈమేజ్ కి ఆ కథను సెట్ కావు అనే ఉద్దేశంతో మంచి కథలను కూడా వారు రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక కొంత కాలం క్రితం జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... బొమ్మరిల్లు కథను భాస్కర్ నాకు మొదట వివరించాడు. ఆ స్టోరీ నాకు సూపర్ గా నచ్చింది. కాకపోతే ఆ మూవీ నాపై అస్సలు వర్కౌట్ కాదు అని నాకు అనిపించింది. ఎందుకు అంటే నా సినిమాలో ఫైట్లు , డైలాగులు , డాన్స్ ఇవన్నీ ప్రేక్షకులు ఆశిస్తారు. అలాంటివి ఆశించే సినిమాకు వచ్చిన జనాలకు అవి లేకపోతే ఆ మూవీ వారికి నచ్చదు. అవి బొమ్మరిల్లు కథలో లేవు.

అందుకే కథ నచ్చిన ఆ సినిమాను రిజెక్ట్ చేశాను అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ కూడా అలా కథ నచ్చినప్పటికీ తన ఈమేజ్ వల్ల ఓ సినిమాను వదులుకున్నాడట. ఆ విషయాలు తెలుసుకుందాం ...  కొన్ని సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఖుషి అనే మూవీ రూపొంది బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితం సూర్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... ఖుషి మూవీ తర్వాత నేను ఆయనకు ఓ ప్రేమకథ ను వివరించాను. అది వింటున్నప్పుడు ఆయన ఎంతగానో హ్యాపీ ఫీలయ్యారు. సినిమా చేద్దాం సార్ అన్నాను.

దానితో పవన్ కళ్యాణ్ , సూర్య ఇప్పుడు నాకున్న ఈమేజ్ కి నేను ఒక అమ్మాయి వెనక తిరగడం , ఆ అమ్మాయిని లవ్ చేయడం ఇలాంటి కథలు నాకు సెట్ కావు. ఇలాంటి కథలు జనాలు కూడా నా నుంచి ఆశించడం లేదు. ఈ సినిమా వద్దు అని అన్నాడట. సూర్య అయిన కూడా సెట్ అవుతుంది సార్ అన్నా కూడా పవన్ కళ్యాణ్ కాన్విన్స్ కాలేదట. అలా కథ విని చాలా ఎంజాయ్ చేసిన మూవీ చేయడానికి మాత్రం పవన్ పెద్దగా ఆసక్తి చూపలేదని సూర్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: