సాధారణంగా ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా రిలీజ్ తర్వాత రికార్డులు క్రియేట్ చేయడం సాధారణంగా జరుగుతుంది. అయితే దేవర మాత్రం ఈ విషయంలో భిన్నమనే చెప్పాలి. విడుదలకు ముందే దేవర ఖాతాలో ఎన్నో రేర్ రికార్డులు క్రియేట్ కావడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. దేవర మూవీ ఖాతాలో ఎన్నో రేర్ రికార్డులు ఉండటం ఒకింత సంచలనం అవుతోంది.
 
ఇప్పటివరకు ఏ సినిమా విడుదలైనా నాన్ బాహుబలి రికార్డ్స్ అని మాట్లాడుకునేవారు. ఇకపై మాత్రం కొన్ని రికార్డులకు సంబంధించి నాన్ దేవర రికార్డులు అని మాట్లాడుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో డాల్బీ అట్మాస్ తో విడుదలవుతున్న సినిమా దేవర కావడం గమనార్హం.
 
తెలుగు రాష్ట్రాల్లో 4000 కంటే ఎక్కువగా బెనిఫిట్ షోలు ప్రదర్శితమవుతున్న సినిమా కూడా దేవర కావడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ఓవర్సీస్ లో ప్రీ సేల్స్ తో ఏకంగా 2 మిలియన్ డాలర్ల కలెక్షన్లతో సంచలనం సృష్టించిన మూవీ దేవర అని చెప్పవచ్చు. ఎన్టీఆర్ హీరోగా హిట్ సాధించిన స్టూడెంట్ నంబర్1 విడుదలైన రోజునే దేవర థియేటర్లలో రిలీజ్ కానుండటం కూడా అరుదైన ఘనత అని చెప్పవచ్చు.
 
యువసుధ ఆర్ట్స్ బ్యానర్ లో దేవర తొలి సినిమా కాగా ఈ బ్యానర్ భవిష్యత్తును సైతం ఈ సినిమా నిర్దేశించనుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కు ఈ సినిమాతో పూర్వ వైభవం రావాలని కళ్యాణ్ రామ్ కు నిర్మాతగా ఈ సినిమా భారీ విజయాన్ని అందించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. భారీ టికెట్ రేట్లు ఈ సినిమాకు ఎంతమేర ప్లస్ అవుతాయో చూడాల్సి ఉంది. దేవర అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 60 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుని అరుదైన ఘనత సాధించింది. దేవర రేర్ రికార్డుల విషయంలో అభిమానులు సైతం ఎంతో సంతోషిస్తున్నారని చెప్పవచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి: