- దేవరతో దడ పుట్టిస్తున్న ఎన్టీఆర్.!
- ఎన్టీఆర్ కెరియర్ లోనే దేవర రికార్డు సాధిస్తుందా.?
జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి ఒక్క మాటలో చెప్పడం కష్టం. నటనే ప్రాణంగా, నందమూరి పేరును ఆకాశానికి తీసుకెళ్లడమే లక్ష్యంగా, తాతకు తగ్గ మనవడిగా ఇప్పటికే ఎంతో పేరు తెచ్చుకున్నారు. నందమూరి ఫ్యామిలీ కాస్త దూరం పెట్టినా, ఎక్కడ వణుకు బెణుకు లేకుండా ఆ ఫ్యామిలీ ఆదరించేలా చేసుకున్నాడు. అలాంటి ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్రస్తుతం అదే రేంజ్ లో సోలోగా పాన్ ఇండియా హీరోగా దేవరాతో మన ముందుకు వస్తున్నాడు. ది గ్రేట్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ మూవీపై అనేక అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్న తరుణంలో దేవర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఈ విషయాలు తెలిస్తే మాత్రం దేవర చిత్రం చూడడానికి తప్పక థియేటర్ల కు పరిగెడతారట. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
దేవరాకు హైలైట్స్ ఇవే
ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అయ్యాయి. ఇప్పటికే ఆయన మూడు సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆంధ్ర వాలా,శక్తి,అదుర్స్. ఈ సినిమాల తర్వాత వస్తున్న మరో మూవీ దేవర. ఇందులో వర ఒక పాత్ర అయితే దేవర ఇంకో పాత్ర ఉంటుంది. అయితే ద్విపత్రాభినయం చేసిన దేవర ఎంత మేర హిట్టవుతుందో చూడాలి.ఈ చిత్రానికి మరో హైలెట్ విషయం ఏమిటంటే జాన్వి కపూర్. బాలీవుడ్ లో ఓ మెరుపు మెరిసిన జాన్వి కపూర్ తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మొదటిసారిగా అడుగు పెట్టింది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ పాటల వల్ల ఆమెకు హైప్ పెరిగింది. అయితే జాన్వి కపూర్ మొదటి భాగంలో కాకుండా రెండో భాగంలో ఎంట్రీ ఇస్తుందట. అలాగే దేవర సినిమాకు సంబంధించి కథ 9 గంటల నిడివి ఉంటుందట. కాబట్టి ఈ సినిమాను రెండు పార్ట్ లుగా తీసుకురాబోతున్నారు. అయితే మొదటి పార్ట్ సెప్టెంబర్ 27న రిలీజ్ అవ్వబోతోంది. ఈ మూవీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. 1980-90నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ చూస్తే మాత్రం ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా ధైర్యంగా బ్రతుకుతూ పేద ప్రజల కోసం నిలబడే వ్యక్తిగా కనిపిస్తారు. ఎన్టీఆర్ ను ఈ విధమైనటువంటి యాక్షన్స్ సన్నివేశాల్లో ఎప్పుడు చూడలేదని చెప్పవచ్చు. ఇక క్లైమాక్స్ కు వచ్చేసరికి చివరి 40 నిమిషాలు పూర్తిగా అండర్ వాటర్ లో సినిమాలు తెరక్కించారట.