ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా దేవర మానియా స్పష్టంగా కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తాజాగా చేసిన దేవర సినిమా... శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే ఈ సినిమా టికెట్ల కోసం జనాలు ఇవ్వబడుతున్నారు. చాలామంది టికెట్లు కూడా కొనేసుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమాలో... బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

 

దీంతో.. బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా దేవర  సినిమా పైన మంచి క్రేజ్ వచ్చింది. అయితే... దేవర సినిమా శుక్రవారం రిలీజ్ కానున్న నేపథ్యంలో... ఈ సినిమా పైన బెట్టింగ్లో విపరీతంగా జరుగుతున్నాయట. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవర సినిమా హిట్ అవుతుందా? లేక ఫ్లాఫ్ అవుతుందా? మంచి కలెక్షన్స్ రాబడుతుందా ? యావరేజ్ టాక్ తెచ్చుకుంటుందా? అని జనాలందరూ బెట్టింగ్ చేస్తున్నారట.

 

ఏపీలో బెట్టింగ్ కల్చర్ ఎక్కువ ఉన్న నేపథ్యం లో... చాలామంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ బెట్టింగ్లో పాల్గొంటున్నట్లు సమాచారం. కాయ్ రాజా కాయ్ అంటూ లక్షల్లో డబ్బులు.. పెడుతున్నారట. సినిమా.. కలెక్షన్ల పైన ఎక్కువ మంది  బెట్టింగ్ పెట్టడం జరుగుతోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాల్చల్ అయింది. అయితే బెట్టింగ్ ఆరోపణలు రావడంతో ఏపీ పోలీసులు.. అలర్ట్ అయ్యారు.

 

ఎవరైనా బెట్టింగ్ కు పాల్పడితే..కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కడ తగ్గడం లేదట. ఆన్లైన్ బెట్టింగ్లు కూడా చేస్తున్నారట. మరి ఇప్పటి క్రేజ్ తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత దేవర సినిమాతో సోలోగా వస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. అరవింద సమేత తర్వాత సోలోగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేయలేకపోయారు. జక్కన్న సినిమా కారణంగానే ఇంత లేట్ అయింది. కాగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ సినిమా రెండు భాగాల్లో రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: