అసలు విషయం ఏమిటంటే? ఇపుడు చాలా వరకు అతని రెమ్యునరేషన్ విషయం గురించి చర్చించుకుంటున్నట్టు చాలా స్పష్టంగా అర్ధం అవుతోంది. వరంగల్ కి చెందిన ఈ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ చాలామందికి సుపరిచితుడే. వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో పాపులర్ అయ్యాడు. ఇతని రెమ్యూనరేషన్ గురించి చెబితే షాక్ తింటారు. వారానికి 2 లక్షల రూపాయలను అందుకుంటున్నట్టు సమాచారం. నేటికీ 4 వారాలు అవుతోంది కాబట్టి దాదాపు 8 లక్షల రూపాయల వరకు తన అకౌంట్లో జమ చేసుకున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి.
ఇకపోతే, ఇక టాస్కులను ఆడడంలో, ఇతర కంటెస్టెంట్లను కలుపుకుపోవడంలో కూడా ఇతడు పి హెచ్ డి చేసినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది... అదేనండి! మనోడిది కలుపుకుపోయే మనస్తత్వం అని ఈ షో చూసినోళ్లకి ఇట్టే తెలిసి పోతుంది. అందుచేత సహజంగానే అందరి చేత మన్ననలు పొందుతున్నాడు. దాంతోనే, రోజురోజుకీ నబీల్ పాపులారిటీ పెరుగుతూ వస్తోంది. ఇక షో విజయవంతంగా పూర్తి చేస్తే, మరిన్ని లక్షల రూపాయలు గెలుచుకోబోతాడని టాక్ నడుస్తోంది. మరి మీ ఓటు ఎవరికో కింద కామెంట్ చేయండి మరి!