జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ రేపు అనగా సెప్టెంబర్ 27 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ , ఎన్టీఆర్ కు జోడిగా కనిపించబోతోంది. ఈ సినిమాతోనే ఈ బ్యూటీ తెలుగు తెరకు పరిచయం కానుంది. మూవీ లో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతుండగా , అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఇది ఇలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా కావడం ఎన్నో సూపర్ సక్సెస్ ఫుల్ సినిమాలకు దర్శకత్వం వహించిన కొరటాల శివమూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడం , ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.  ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ సినిమాను అత్యంత భారీ ధరకు మేకర్స్ అమ్మివేస్తారేమో అని జనాలు భావించారు. కానీ ఈ మూవీ యూనిట్ మాత్రం ఈ సినిమాను కేవలం 180 కోట్ల ధరకే ప్రపంచ వ్యాప్త థియేటర్ హక్కులను అమ్మి వేసినట్లు తెలుస్తోంది. దానితో ఈ సినిమా టార్గెట్ చాలా చిన్నగానే ఉంది. ఈ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినట్లు అయితే అవలీలగా ఈ మూవీ మొదటి వీకెండ్ పూర్తి అయ్యే సరికి బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది.

మరి మొదటి వీకెండ్ పూర్తి అయ్యే సరికి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ సినిమాకు భారీ ఎత్తున లాభాలు వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. తెలుగు సినిమాలలో అత్యధిక లాభాలను అందుకున్న సినిమాలలో ఎక్కువ సినిమాలు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమాలే ఉన్నాయి. ఒక వేళ ఈ మూవీ కి మంచి టాక్ వచ్చినట్లు అయితే ఈ మూవీ రాజమౌళి సినిమా రికార్డులను దాటేసే అవకాశం చాలా వరకు ఉంది. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: