- జానూ పాపగా తెలుగువారిలో గుర్తింపు..
 -శ్రీదేవి వారసత్వంతో తెలుగులోకి ఎంట్రీ
- నందమూరి హీరో సెంటిమెంట్..

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా కూడా దేవర మూవీ లోని జాన్వీ కపూర్ పేరే వినిపిస్తోంది.. ఈ ముద్దుగుమ్మ  బాలీవుడ్ సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో రాణించాలని ఎన్నో కలలు కంటోంది.మరి అలాంటి జాన్వీ కాపూర్ కి దేవర సినిమా ఏమేర హెట్ ఇస్తుంది. జాన్వీ కి సౌత్ లోకి రావడానికి దేవర మూవీ కలిసి వస్తుందా అనేది ఇప్పుడు చూద్దాం..

 జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ :
శ్రీదేవి బోనీ కపూర్ ల జంటకు 1997 మార్చ్ 6 న జన్మించింది జాన్వీ కపూర్.. చిన్నప్పటి నుండి తల్లి లాగే ఇండస్ట్రీలో రాణించాలి అని ఎన్నో కలలు కనీ ఎంతో ఆశపడేది. అలా తల్లి సినిమాల వారసత్వంతో తండ్రి నిర్మాతగా ఉన్న పేరుతో మొదటిసారి బాలీవుడ్ లో 2018లో ధడక్ అనే మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.అయితే మొదటి సినిమా జాన్వీ కపూర్ కి పేరు తెచ్చిపెట్టలేదు. ఆ తర్వాత ఘోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్,,రూహి, గుడ్ లక్ జెర్రీ వంటి ఎన్నో సినిమాల్లో నటించింది.ఇక ఈమె చివరిగా బాలీవుడ్ లో మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే మూవీ తో రీసెంట్ గా వచ్చినప్పటికీ ఈ సినిమా కూడా జాన్వీ కపూర్ కి అంత కలిసి రాలేదు. ఇక ఎప్పటినుండో సౌత్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న జాన్వీ కపూర్ కి నందమూరి తారకరత్న సరసన దేవర మూవీలో అవకాశం వచ్చింది. అలా అవకాశం రావడంతోనే వెంటనే జాన్వి కపూర్ ఒప్పుకుందట.. ఇక సినిమా విషయంలో కొంతమంది సినీ పెద్దల నిర్ణయం తీసుకొని ఆమె తెలుగులోకి దేవర మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. ఇక దేవర సినిమాకి సంబంధించి ఈమె ఫస్ట్ లుక్ తోనే ఎంతోమంది తెలుగువారికి దగ్గరయిపోయింది. ముఖ్యంగా అచ్చ తెలుగు ఆడపిల్లలా లంగా వోణీలో జాన్వీ కపూర్ గెటప్ చాలా అద్భుతంగా ఉంది.


 అలాగే తెలుగులో సెటిల్ అవ్వడం కోసం తెలుగు భాష కూడా నేర్చుకొని ఎంతో ముద్దుగా మాట్లాడుతోంది. దాంతో తెలుగు వారందరికీ జాన్వీ కపూర్ జానూ పాపగా మారిపోయింది.ప్రస్తుతం ఈమెను అందరూ జాను పాప అంటూ ప్రేమగా పిలుస్తున్నారు. ఇక మొదటి సినిమా నందమూరి హీరోతో ఎంట్రీ ఇవ్వడంతో జాన్వి కపూర్ కి ఇండస్ట్రీలో కలిసి వస్తుంది అని చాలామంది భావిస్తున్నారు.శ్రీదేవి సీనియర్ ఎన్టీఆర్ సరసన మనవరాలు పాత్రలో నటించి ఆ తర్వాత ఆయన పక్కన హీరోయిన్ గా చేసింది.అలా ఎన్టీఆర్ శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో కూడా జాన్వి కపూర్ ఎంట్రీ ఇవ్వడంతో ఆమెకు తెలుగు ఇండస్ట్రీ బాగా కలిసి వస్తుంది అని పలువురు సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ జాన్వి కపూర్ నటించిన దేవర మూవీ హిట్ అయితే మాత్రం ఆమెకు తెలుగులో ఇక తిరుగుండదు అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే జాన్వి కపూర్ ఎన్టీఆర్ లు చేసిన చుట్టమల్లె సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ పాటలో జాన్వీ కపూర్ అందాలకు ఎంతోమంది ఫిదా అయ్యారు. అలాగే ఈ మూవీ నుండి వచ్చిన దావూది సాంగ్ లో కూడా ఎన్టీఆర్ కి దీటుగా జాన్వీ కపూర్ స్టెప్పులు వేసింది. అలా నటనలోనే కాదు డాన్స్ లో కూడా తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది జాను పాప.మరి టాలీవుడ్ జాను పాపకి ఏ విధంగా కలిసి వస్తుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: