* ఇండస్ట్రీ రికార్డ్స్ ను దున్నేయబోతున్న 'దేవర'.?
* 'దేవర'తో అలాంటి సెంటిమెంట్ బ్రేక్ చేస్తారా.?
(ఏపీ-ఇండియాహెరాల్డ్): ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులకు 'దేవర' ఫీవర్ పట్టుకుంది.రెండుపార్టులుగా తెరకెక్కతున్న ఈ మూవీ తొలిపార్ట్ రేపు (సెప్టెంబర్-27) సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతుంది.వీకెండ్ కావడంతో ఇప్పటికే ఆన్లైన్లో టికెట్ బుకింగ్స్ క్షణాల వ్యవధిలో అమ్ముడయ్యాయి.దర్శక ధీరుడు జక్కన్న డైరెక్షన్ లో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీతో గ్లోబల్ స్థాయిలో ఎన్టీఆర్ గుర్తింపు పొందారు.అయితే 'అరవింద్ సమెత' తర్వాత సోలోగా వస్తున్న ఎన్టీఆర్ కు ఈ మూవీతో ఇంకో మెట్టు పైకి ఎదగడం ఖాయమని తెలుస్తుంది.ఎన్టీఆర్ డ్యుయెల్ రోల్ లో నటించిన దేవర సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జనతా గ్యారేజ్ సినిమాతో హిట్ కాంబినేషన్‌గా పేరు దక్కించుకున్న ఎన్టీఆర్ - కొరటాల శివ 'దేవర' సినిమాతో కూడా ఇండస్ట్రీ రికార్డ్స్ దున్నేసే విధంగా ఈ చిత్రాన్ని తెరకేక్కించినట్లు తెలుస్తుంది. అయితే దేవర సినిమాకు ప్రీ రిలీజ్ బజ్ క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. అందుకే సినిమాకు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తుంది.
నిజానికి రాజమౌళితో మూవీ చేసిన తర్వాత ఏ హీరోయినా మరో సినిమా చేసి హిట్‌కొట్టిన రికార్డు లేదు. మరి ‘దేవర’తో ఎన్టీఆర్ సెంటిమెంట్‌ను అధిగమిస్తాడా? లేదా? అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.అదే కనుక జరిగితే అలాంటి సెంటిమెంట్ను తారక్ బ్రేక్ చేసినట్లే. అయితే ఇప్పటికే టీజర్, సాంగ్స్ మూవీపై అంచనాలు పెంచాయి. ఇక మూవీ విడుదలకు ముందు నార్త్ అమెరికా సహా పలు దేశాల్లో 2 మిలియన్స్ యూఎస్ డాలర్స్ రాబట్టినట్లు ట్రేడ్ రిపోర్టులు పేర్కొంటున్నాయి.
పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో విడుదల కానున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే సీడెడ్‌లో రూ.22 కోట్లు,నైజాంలో రూ.44 కోట్లు, ఉమ్మడి ఉత్తరాంధ్రలో రూ.12.40 కోట్లు,గోదావరి జిల్లాలో దాదాపు 14 కోట్లు,గుంటూరులో రూ.8.50 కోట్లు, కృష్ణాలో రూ.7.20 కోట్లు, నెల్లూరులో రూ.4.20కోట్ల బిజినెస్ చేసింది. తెలంగాణ, ఏపీతో కలిపి దాదాపు రూ.112.55కోట్లు, కర్ణాటకలో రూ.16 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ.కోటి, ఉత్తర భారత్ లో దాదాపు రూ.20కోట్లు, ఓవర్సీస్‌లో రూ.27 కోట్ల బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.182 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.ఈ సినిమా థియేట్రికల్‌గా రూ.184 బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగుతున్నది.ఎన్టీఆర్ సోలో హీరోగా చేస్తున్న ఈ మూవీ బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా రికార్డులకెక్కింది.అలాంటి ఈ మూవీలో మొదటి సారి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా హిట్ అయితే వెంటనే 'దేవర పార్ట్ 2' ను షురూ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.