జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మూవీ ఈనెల 27వ తేదీన అంటే రేపే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏకంగా తెలుగులో మాత్రమే కాకుండా వివిధ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా దేవర మూవీ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన సినిమా కావడం.. ఇక త్రిబుల్ ఆర్ లాంటి వరల్డ్ వైడ్ హీట్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఈ మూవీపై అంచనాలు మరో రేంజ్ లో ఉన్నాయి.


 ఇంకోవైపు ఆచార్య లాంటి దిజాస్టర్ మూవీ తర్వాత కొరటాల శివ చేస్తున్న మూవీ కావడం.. ఇక ఈ మూవీలో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండడం కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఇప్పటికే  ఆన్లైన్లో టికెట్స్ విడుదలవ్వగా అన్ని షోస్ కూడా హౌస్ ఫుల్ అయిపోయాయి. దీంతో దేవర మూవీకి భారీ ఓపెనింగ్స్ ఖాయం అని అటు అభిమానులు కూడా ఫిక్స్ అయిపోయారు. అయితే రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన త్రిబుల్ ఆర్ వరల్డ్ వైడ్ హిట్ తర్వాత ఇక ఇద్దరు హీరోలని అభిమానులు గ్లోబల్ స్టార్స్ అని పిలుచుకోవడం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు దేవర సినిమా హిట్ అయితేనే తారక్ నిజమైన గ్లోబల్ స్టార్ అవుతాడని కొంతమంది సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


 దీని వెనక కారణం కూడా లేకపోలేదు. త్రిబుల్ ఆర్ సినిమా విడుదలైన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మెయిన్ హీరోగా కనిపించలేదని.. సెకండ్ హీరోలా అతని పాత్ర ఉందనే వాదన సోషల్ మీడియాలో గట్టిగా వినిపించింది. దానికి తోడు త్రిబుల్ ఆర్ సూపర్ హిట్ అయినప్పటికీ కూడా క్రెడిట్ మొత్తం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల కంటే అటు రాజమౌళికే వెళ్ళింది. జక్కన్న సినిమా కాబట్టి ఈ రేంజ్ లో హిట్ అయింది అని అందరూ అనుకున్నారు. జక్కన లేకపోయి ఉంటే ఈ ఇద్దరు హీరోలకు ఆ రేంజ్ లో హిట్ దక్కేది కాదు అనే టాక్ కూడా సోషల్ మీడియాలో వినిపించింది. అందుకే ఇప్పుడు త్రిబుల్ ఆర్ తర్వాత చేస్తున్న దేవర సినిమాతో ఆ రేంజ్ హిట్టు కొట్టాడు అంటే తారక్ నిజమైన గ్లోబల్ స్టార్ అయినట్టే. రాజమౌళి సినిమా కాదు తాను వేరే దర్శకుడు తో సినిమా తీసిన ఆ రేంజ్ లో హిట్టు కొట్టును అనే నిరూపించినట్టే. ఇక తన మార్కెట్ ఏ రేంజ్ లో ఉంది అన్న విషయాన్ని విమర్శించిన వాళ్లకి అర్థమయ్యేలా చేసినట్టే. అందుకే తారక్ వరల్డ్ వైడ్ హిట్ కొట్టాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: