నైజాం ఏరియాలో రూ.45 కోట్లు.
ఆంధ్రాలో రూ.46 కోట్లు
సీడెడ్ రూ .22 కోట్లు
కర్ణాటక రూ.15 కోట్లు
నార్త్ రూ.20 కోట్లు
ఓవర్సీస్ రూ.26 కోట్లు
కేరళ రూ.50 లక్షలు.
తమిళనాడు- రూ.6 కోట్లు..
ఇలా మొత్తం మీద దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల రూపాయల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. దేవర సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే సుమారుగా రూ.360 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకంగా రూ.230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ చేస్తేనే దేవర సినిమా సక్సెస్ అయినట్టు లెక్క అంటూ సినీ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి
దేవర సినిమాతో ఎన్టీఆర్ ముందు ఒక పెద్ద టార్గెట్ ఉందని.. తన సినీ కెరియర్ లోనే ఇప్పటివరకు ఇంత పెద్ద టార్గెట్ లేదని కూడా చెప్పవచ్చు.. ప్రస్తుతం సోలో హీరోగా మొదటిసారి ఇంత బిజినెస్ జరగడం, ఇంత పెద్ద టార్గెట్ తో రావడం.. తొలిసారి ముఖ్యంగా హిట్ తో సరిపెట్టుకోకుండా బ్లాక్ బస్టర్ కొట్టాలనే ఆలోచనలో ఏకంగా రూ.500 కోట్ల గ్రాస్ టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు ఎన్టీఆర్. ఒకవేళ ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తే ఎన్టీఆర్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా దేవర నిలవబోతోంది. అంతేకాదు సోలో హీరోగా వచ్చి ఈ రేంజ్ లో కలెక్షన్ లు రాబడితే మాత్రం పాన్ ఇండియా హీరోగా.. తన కెరియర్ లో మొదటి పాన్ ఇండియా సినిమాతోనే రికార్డు సృష్టించబోతున్నారు ఎన్టీఆర్.