తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి చిత్రం మీకు గుర్తుంది కదా? ఈ సినిమాలో తలైవా కూతురిగా అదర గొట్టిన అమ్మాయి సాయి ధన్సికని మర్చి పోవడం అసాధ్యం. ఎందుకంటే ఆ సినిమాలో రౌడీ బాయ్ గా ఆమె చేసిన యాక్షన్ సూపర్బ్ అని చెప్పుకోవచ్చు. తెలుగులో తక్కువ గానీ తమిళంలో ఈ అమ్మాయి చాలా ఫేమస్. తిరుడి చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన ధన్సిక అనతి కాలంలోనే తమిళ తంబీలకు ఫెవరెట్ అయిపోయింది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ హిట్ మూవీ కబాలిలో చాన్సు కొట్టేసింది. కాగా ఇప్పుడు ఈ భామ ప్రధాన పాత్రలో నటించిన సైకో థ్రిల్లర్ మూవీ దక్షిణ.

మంత్ర, మంగళ వంటి సూపర్ హిట్ తెలుగు చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ "ఓషో తులసీరామ్" ఈ సినిమాను డైరెక్ట్ చేయడం విశేషం. కాగా, ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ మూవీపై ఆసక్తిని కలిగించాయి. ఈ సినిమా కూడా ఫ్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్టు భోగట్టా. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో సాయి ధన్సిక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలరించనుంది. ఇక అసలు విషయంలోకి వెళితే... ఈ బ్యూటీ లేటేస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో చిచ్చు పెడుతున్నాయి.

మూవీ ట్రైలర్ ఈవెంట్లో సాయి ధన్సిక చీరకట్టులో మెరిసిపోయింది. ఆమె సాధారణంగా చీరకట్టులో కనబడడం చాలా అరుదు. అవును, ఒకప్పుడు జీన్స్, టీషర్ట్స్ లో రౌడీబేబీగా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు చీరకట్టులో మెస్మరైజ్ చేయడంతో తమిళ తంబిలతో పాటుగా తెలుగు కుర్రాళ్ళు కూడా ఆమె అందాలకి ఫిదా అయిపోతున్నారు. సాయి ధన్సిక లేటేస్ట్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇలాంటి షో ముందెన్నడూ చేయలేదని, ధన్సికకి జీన్స్.. ఫ్యాన్స్ తో పాటుగా చీరలు కూడా బాగా సెట్ అయ్యాయని సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: