ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీని ప్రమోట్ చేస్తూ అమెరికా లోని వివిధ పట్టణాలను చుట్టపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి మొదటి మూడు రోజులలోనూ ఓవర్సీస్ లో రికార్డు కలక్షన్స్ వచ్చే ఆస్కారం కనిపిస్తోంది. దీనికితోడు ప్రస్తుతం లాస్ ఏంజల్స్ లో జరుగుతున్న ఒక ఫిలిమ్ ఫెస్టివెల్ లో జూనియర్ పాల్గొనడమే కాకుండా ఆ ఫెస్టివెల్ నిర్వాహకుల అభ్యర్థన మేరకు తారక్ వేదిక పైకి రాగానే ఆ ఫిలిమ్ ఫెస్టివెల్ కు వచ్చిన ప్రేక్షకులు అందరు ఈ ఫెస్టివెల్ నిర్వాహకుల అభ్యర్థనమేరకు తారక్ ఫెస్టివెల్ కు వచ్చిన అభ్యర్థులతో తారక్ చక్కటి ఇంగ్షీషు భాషలో మాట్లాడటం చూసి ఆ ఫెస్టివెల్ నిర్వాహకులు కూడ జూనియర్ పై ప్రశంసలు కురిపించినట్లు వార్తలు వస్తున్నాయి.



అంతేకాదు అమెరికా లాస్ ఏంజెల్స్ లో జరుగుతున్న ‘BEYOND 2024’ ఫెస్టివెల్ లో పాల్గొంటున్న అనేక దేశాల నుండి వచ్చిన ప్రతినిధుల కోసం ‘దేవర’ సినిమాను ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి లాస్ ఏంజల్స్ లో ఉన్న ఈజిప్ట్ యన్ ధియేటర్ కు సంబంధించి 26వ తారీఖు సాయంత్రం ఈ మూవీ స్పెషల్ షోలను వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ షోలకు సంబంధించి 516 సీట్స్ ఉంటే ఇప్పటికే 90శాతం టిక్కెట్స్ చాల ముందుగా అవ్వడం ‘దేవర’ మ్యానియాను సూచిస్తోంది.



అంతేకాదు ఈ స్పెషల్ షోను వీక్షించడానికి అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు కూడ రాబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ స్పెషల్ షోలు అమెరికాలో ప్రారంభం అయ్యే సమయానికి ఇండియాలో ఈ మూవీ ప్రీమియర్ షోలు పూర్తి కావడంతో ‘దేవర’ ఫలితం ఆసమయానికి జూనియర్ కు తెలిసిపోయే ఆస్కారం ఉంది. అంతేకాదు అమెరికాలోని అనేక కీలక పట్టణాలలో అదేవిధంగా తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఈ మూవీ స్పెషల్ షోలు వేస్తున్న నేపద్యంలో ఈమూవీ మొదటిరోజు ఓవర్సీస్ కలక్షన్స్ రెండు మిలియన్స్ దాటినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు..




మరింత సమాచారం తెలుసుకోండి: