మరికొన్ని గంటల్లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా దునియాని దున్నేయడానికి రెడీ అయిపోయింది. దాంతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఈరోజు మిడ్ నైట్ షోలు పడుతుండటంతో థియేటర్ల వద్ద వేల సంఖ్యలో జనాలు సందడి చేస్తున్నారు. ఇప్పటికే యూఎస్ మార్కెట్లో పలు రికార్డులు నమోదు చేసిన దేవర తాజాగా ఆస్ట్రేలియాలోని కూడా ఓ రికార్డు నమోదు చేసినట్టు చిత్ర యూనిట్ తెలిపింది.
విషయం ఏమిటంటే... ఆస్ట్రేలియాలోని దాదాపుగా 13 స్క్రీన్స్ లో విడుదలకు రెడీ అయిన దేవర సినిమా అడ్వాన్స్ బుకింగ్ లో 3 లక్షల డాలర్లకు పైగా వసూలు చేసినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రెండు మూడు రోజుల్లో 5 లక్షల పైగా డాలర్లను వసూలు చేయొచ్చని చిత్ర యూనిట్ ఆశిస్తుంది. ఇకపోతే ఆస్ట్రేలియాలో ఇంతవరకు మరే తెలుగు సినిమాకు రానంత బజ్ దేవర సినిమాకి రావడం చూసి చిత్ర నిర్మాతలు ఖుషి అవుతున్నారు.
మాస్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో... జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, బాలీవుడ్ తార జాన్వి హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించిన ఈ సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి. తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీతం అందించగా... తాజాగా ఆయన ఓ మీడియా వేదికగా మాట్లాడుతూ, దేవర సినిమా దద్దరిల్లిపోతుందని, హాలీవుడ్ సినిమాలు అవెంజర్స్ సినిమాలను మరిపిస్తుందని గర్వంగా చెప్పుకొచ్చారు. దర్శకుడు కొరటాల శివ, నటుడు జూనియర్ ఎన్టీఆర్ తో పనిచేయడం ఎప్పటికీ మరిచిపోలేనని, వారితో మరల మరల సినిమాలు చేయాల్సి వచ్చిన, అవకాశాన్ని వదులుకోనని చెప్పుకొచ్చారు! ఇక మరికొన్ని గంటల్లో దేవర సినిమా ఫలితం వెలువడబోతోంది. ఇక ఈ సినిమా గురించి మీరు ఏమి అనుకుంటున్నారు అనే విషయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. అదేవిధంగా దేవర సినిమా ఎలా ఉందో తెలుసుకోవడం కోసం ప్రివ్యూ కొరకు మా సైట్ సందర్శించగలరు!