ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల తార శ్రీదేవి కూతురు జాన్వి నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక జాన్వి అందాన్ని తల్లి శ్రీదేవితో పోల్చడం కష్టమే గాని, ఓ యాంగిల్ లో పరవాలేదు అనిపిస్తుంది. ఇప్పటి హీరోయిన్లతో పోల్చుకుంటే కాస్త బెటరే. ఇక అసలు విషయంలోకి.... దేవర చిత్ర ప్రమోషన్లలో పాలుపంచుకున్న జాన్వి మాట్లాడుతూ... ఎన్టీఆర్ గొప్ప మనసు గురించి చెప్పుకొచ్చింది.
జూనియర్ ఎన్టీఆర్ కి ఎవరైనా నచ్చితే, సదరు సినిమా షూటింగు సమయంలో తన ఇంటి నుండే ఆహారం తెప్పించి ఇస్తాడట! జాన్వి విషయంలో కూడా అదే జరిగినట్టు చెప్పుకొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ఇంటి నుండి వచ్చిన బిరియాని తిన్న జాన్వి... ఫుడ్డు అదిరిపోయిందని, అలాంటి బిరియాని తాను ముంబాయిలో కూడా తినలేదని చెప్పుకొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానిస్తే, ఆ అభిమానాన్ని తట్టుకోవడం చాలా కష్టం అని అభిప్రాయ పడింది. ఆ మాటలు విన్న సదరు యాంకరు. . . మరి మీరు ఎప్పుడైనా ఎన్టీఆర్ గారికి ఫుడ్ పంపించారా? అనే ప్రశ్న వేయగా. .. జాన్వి సింపుల్ గా లేదని చెప్పింది. ఇక దీనికి కారణాలు చెబుతూ. .. అలాంటి రుచికరమైన ఫుడ్ ముంబైలో దొరకదని... అందుకే చొరవ తీసుకోలేకపోయానని వాపోయింది ఈ ముంబై ముద్దుగుమ్మ! ఒకవేళ ఫుడ్డు నచ్చకపోతే ఎన్టీఆర్ ముఖం మీద చెప్పేస్తాడని... అందుకే ఛాన్స్ తీసుకోవడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయానని బాధపడింది.