కొంత మంది దర్శకులు , నిర్మాతలు ఓ కథతో , ఓ హీరోతో సినిమా చేయాలి అనుకొని ఆ హీరోను సంప్రదించి కథను వినిపించిన సందర్భంలో కొంత మంది కథ నచ్చినట్లయితే మాకు కథ నచ్చలేదు సినిమా చేయము అని చెప్పేసి ఊరుకుంటారు. కానీ మరి కొంత మంది మాత్రం కథ మొత్తం విన్న తర్వాత తమకు ఆ సినిమా కథ సెట్ కాకపోయినా వేరే వారికి ఈ సినిమా కథ సెట్ అయ్యే అవకాశాలు ఉంటే వారి పేరును సూచిస్తూ ఉంటారు. అలా బాలయ్య తన దగ్గరకు వచ్చిన ఒక కథను విని సూపర్ గా అనిపించినప్పటికీ అది తనకు సెట్ కాదు కానీ మరో స్టార్ హీరోకి సెట్ అవుతుంది అని సలహా ఇచ్చాడట. ఇక ఆ సలహా మేరకు మేకర్స్ ఆ హీరోను సంప్రదించి అతనితో సినిమా చేయగా అది బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుందట. ఆ సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం.

కొంత కాలం క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుపాటి రానా హీరోలుగా భీమ్లా నాయక్ అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే ను అందించాడు. సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చేసిన పాత్ర కోసం మొదట బాలయ్య ను అనుకొని ఆయనకు కథను వినిపించగా ఆ కథ బాగానే ఉంది కానీ నాపై సెట్ కాదు. ఇది పవన్ కళ్యాణ్ తో చేయండి సూపర్ గా వర్కౌట్ అవుతుంది అని సలహా ఇచ్చాడట. ఆ సలహాను ఫాలో అయిన మేకర్స్ పవన్ కళ్యాణ్ సంప్రదించడం , ఆయన ఒప్పుకోవడం జరిగిందట. అలా భీమ్లా నాయక్ మూవీ తో పవన్ కళ్యాణ్ కు మంచి విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: