సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదగడం ముఖ్యం కాదు. అలా ఎదిగిన తర్వాత అదే స్థాయిలో కెరియర్ చాలా సంవత్సరాల పాటు కొనసాగించడం చాలా ముఖ్యం. ఇక స్టార్ హీరోయిన్గా ఎదిగిన తర్వాత ఆ స్థాయిలోనే కెరియర్ను చాలా సంవత్సరాల పాటు కొనసాగాలి అంటే ఏ సినిమాలోని ఎంచుకోవాలి అనే విషయం మాత్రమే కాదు ఏ సినిమాలను రిజెక్ట్ చేయాలి అనే విషయంపై కూడా చాలా అవగాహన ఉండాలి. అలా పసిగట్టి హిట్ అయ్యే సినిమాలను ఎంచుకొని ఫ్లాప్ అయ్యే సినిమాలను రిజెక్ట్ చేసుకుంటూ వెళ్తే వారి కెరియర్ చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో అద్భుతంగా ముందుకు సాగుతూ ఉంటుంది.

ఇలా ప్లాప్ సినిమాలను రిజెక్ట్ చేయడంలో చాలా ముందు చూపుతో ఉన్న నటీమణులలో రష్మిక మందన ఒకరు. ఈ బ్యూటీ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోయిన్గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తుంది. ఈ ముద్దుగుమ్మ అనేక సినిమాలను రిజెక్ట్ చేసింది. అందులో కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయినవి కూడా ఉన్నాయి. ఇకపోతే ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం. కొంత కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ లో రామ్ చరణ్ కి జోడిగా పూజా హెగ్డే నటించింది. పూజ హెగ్డే పాత్ర కోసం రష్మిక మందన ను ఈ మూవీ యూనిట్ మొదట సంప్రదించగా ఆ ఆఫర్ ను ఈ బ్యూటీ రిజెక్ట్ చేసిందట. ఇక రష్మిక మందన రిజెక్ట్ చేసిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.

ఇక కొంత కాలం క్రితం తమిళ నటుడు విజయ్ హీరోగా బీస్ట్ మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో పూజా హెగ్డే చేసిన పాత్ర కోసం మొదటగా మేకర్స్ రష్మిక ను సంప్రదించారట. ఈమె ఈ సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. ఇక రష్మిక రిజెక్ట్ చేసిన ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇలా ఈ రెండు ఫ్లాప్ మూవీల ఆఫర్లను ఈ బ్యూటీ రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: