- ఐదున్నరేళ్ల త‌ర్వాత ఎన్టీఆర్ నుంచి వ‌స్తోన్న సోలో సినిమా దేవ‌ర‌
- ఎన్టీఆర్ డ్యాన్సులు .. ఫైట్లు .. డైలాగుల కోసం పిచ్చెక్కిపోయున్న ఫ్యాన్స్‌
- వ‌ర‌ల్డ్ వైడ్ రు. 180 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్‌
- ఐదు భాష‌ల్లో భారీ పాన్ ఇండియా సినిమా గా రిలీజ్‌
- కొర‌టాల - ఎన్టీఆర్ కాంబోలో జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత రెండో సినిమా


- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .


టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న దేవ‌ర షోలు మ‌రి కొద్ది గంట‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్క‌డిక‌క్క‌డ ప‌డిపోనున్నాయి. రెండున్న‌ర సంవ‌త్స‌రాలు గా ఎన్టీఆర్ సినిమా కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తోన్న ఫ్యాన్స్ ఆనందం కొద్ది గంటల్లోనే తేలిపోనుంది. ఇదిలా ఉంటే దేవ‌ర సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్ గా రు. 180 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. అంటే కాస్త అటూ ఇటూ గా రు. 185 కోట్ల షేర్ వ‌స్తే దేవ‌ర బ్రేక్ ఈవెన్ అయిపోతుంది.
ఇది పాన్ ఇండియా రేంజ్ లో చూస్తే మ‌రీ అంత పెద్ద టార్గెట్ అయితే కాద‌నే చెప్పాలి .


కేవ‌లం రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ - తెలంగాణ లోనే దేవ‌ర‌ను రు. 113 కోట్ల‌కు అమ్మారు. నైజాంలో రు. 42 కోట్ల‌కు అమ్మారు. రెండు తెలుగు రాష్ట్రాల హ‌క్కుల‌ను నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ తీసుకున్నారు. ఇప్ప‌టికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా దేవ‌ర రు. 60 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. ఈ లెక్క‌న ఊపు చూస్తుంటే ఫ‌స్ట్ డే కంప్లీట్ అయ్యే స‌రికి దేవ‌ర రు. 120 - 130 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు ప్ర‌పంచ వ్యాప్తంగా సాధిస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. సినిమాకు మ‌రింత హిట్ టాక్ వ‌స్తే ఇవి మ‌రింత పెరుగుతాయ‌ని టాక్ ?

మరింత సమాచారం తెలుసుకోండి: