రాజమౌళి హవా తారా స్థాయికి చేరడంతో దర్శకుడు శంకర్ క్రేజ్ నెమ్మదినెమ్మదిగా తగ్గుతోంది. దీనికితోడు లేటెస్ట్ గా విడుదలైన ‘ఇండియన్ 2’ ఎవర్నీ మెప్పించలేకపోవడంతో శంకర్ మ్యానియా మరింత తగ్గింది. దీనితో డిసెంబర్ లో విడుదలకాబోతున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ శంకర్ కెరియర్ కు అత్యంత కీలకంగా మారింది.



ఇలాంటి పరిస్థితుల మధ్య లేటెస్ట్ గా శంకర్ చేసిన కామెంట్స్ ఎవర్ని ఉద్దేశించినవి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి. శంకర్ చాల ఇష్టపడి వంకటేశన్ అనే ఒక తమిళ రచయిత వ్రాసిన ‘వీర యుగ నాయగన్ వేల్ పారి’ అనే నవల హక్కులను కొని ఆ నవల ఆధారంగా సినిమా తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.



అయితే శంకర్ కు తెలియకుండానే ఆనవల లోని కొన్ని సన్నివేశాలు కాపీ కొట్టి ఈమధ్యనే విడుదల అయిన ఒక సినిమాలోని ట్రైలర్ ఉంది అంటూ శంకర్ కామెంట్ చేయడంతో సినిమా ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి. దీనితో ఆసినిమా పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అంటూ శంకర్ చేసిన కామెంట్స్ ఏసీనిమాను ఉద్దేశించినవి అంటూ అనేక ఊహాగానాలు వస్తున్నాయి.



శంకర్‌కు సాహిత్యం పట్ల మంచి అవగాహన ఉంది. అతడు గతంలో  ‘సుజాత, జయమోహన్ లాంటి సుప్రసిద్ధ రచయిలతో కలిసి అనేక సినిమాలకు పని చేశాడు. ప్రస్తుతం శంకర్ అభిమానంతో కొన్న  ‘వీర యుగ నాయగన్ వేల్ పారి’ నవల ఏసినిమాగా రాబోతోంది అన్న విషయమై క్లారిటీ లేదు. అయితే ఈ నవల సినిమాగా రాకుండానే ఆ నవలలోని కొన్ని సన్నివేశాలు కొన్ని సినిమా ట్రైలర్స్ లో వస్తూ ఉండటం శంకర్ కు బాధ కలిగించి ఉండవచ్చు. ప్రస్తుతం అనేకమంది దర్శకులు రచయితలు తాము తీసే సినిమాలలో చేసే రచనలలో ఎటువంటి కాపీ కొట్టడంలేదనీ కేవలం అనుసరణ మాత్రమే అని మొండిగా వాదిస్తున్న పరిస్థితులలో శంకర్ అసహనాన్ని ఎంతమంది పట్టించుకుంటారో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: