స్టార్ హీరోల సినిమాలు అంటే మిడ్ నైట్ షోస్, బెనిఫిట్ షోలు వేయటం మన పాత తరం నుంచి వస్తున్న పద్ధతి. తమ అభిమాన హీరో సినిమాను అందరికంటే ముందుగా చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహ పడుతుంటారు. దానికోసం ఎంతకైనా వెళ్లడానికి అభిమానులు వెనకాడరు. ఇక ఇప్పుడు దీనిని క్యాష్ చేసుకుంటున్నారు బెనిఫిట్ షో నిర్వాహకులు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా తెరపై కనిపిస్తున్న సినిమా కూడా ఇదే. దీంతో అభిమానులు ఎంతో ఎగ్జిట్ మెంట్ తో సినిమా చూడడానికి రెడీ అవుతున్నారు.
అభిమానుల క్రేజే ఆయుధం:
అభిమానుల క్రేజ్ ను బట్టి ఏరియాల వారీగా ఫ్యాన్స్ కోసం బెన్ఫిట్ షోలు ఏర్పాటు చేయడం ఆనవాయితీ. అయితే గతంలో వీటికి రిజనబుల్ ధర ఉండేది. ఇప్పుడు ఆ రేట్లు విపరీతంగా పెంచేశారు. ప్రస్తుతం స్టార్ స్టార్ హీరోలు భారీ బడ్జెట్ సినిమాలకు గవర్నమెంట్ కూడా అదనపు షోలు, టికెట్ రేట్ పెంచడం లాంటి వెసులుబాటు ఇస్తుంది. అయితే ఇది పరిమిత రోజులు వరకే ప్రభుత్వం జీవో ప్రకారం టికెట్ ధరపై వంద రూపాయలు పెంపుకు అనుమతి ఇస్తుంది. అయితే అభిమానుల పేరుతో ఏర్పాటు చేసే బెన్ఫిట్ షోలా రేట్లకు రెక్కలు వచ్చినట్టుగా వ్యవహారం ఎప్పుడు కనిపిస్తుంది.
వారే కీలకం:
గురువారం అర్ధరాత్రి దేవర బెనిఫిట్ షో లను మేకర్స్ వేనున్నారు మిడ్నెస్ షో ఒంటిగంటకు స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్‌లో ఏకంగా 20 రూపాయలుగా థియేటర్లో మిడ్ నైట్ షోలనుు ప్లాన్ చేశారు. అయితే వీటి టిక్కెట్లను ఆన్లైన్లో కాకుండా డైరెక్ట్గా అమ్ముతున్నారు.వీటి వెనక టాలీవుడ్ పెద్దలతో పాటు వన్ న్యూస్ ఛానల్ పి ఆర్ ఓవన్ న్యూస్ ఛానల్ వీఆర్వోలులో గ్రూపుగా థియేటర్లను సెలెక్ట్ చేసుకుని బెనిఫిట్ షోల్ు వేస్తున్నారు. ఇలా స్టార్ హీరోల సినిమాల విడుదల సమయంలో అభిమానుల క్రియేచును క్యాష్ చేసుకుంటున్నాయి టికెట్ మాఫియా ముఠాలు.
సగానికి పైగా మిగిలే:
ఇక దేవర బెనిఫిట్ షో చూడాలంటే అక్షరాల 2000కు పైగా పెట్టాల్సిందే. సాధారణంగా మల్టీప్లెక్స్ లో టికెట్ ధర హై క్లాస్ అయితే 500 ఉంటుంది. కానీ బెనిఫిట్ షో టికెట్ల ధరను భారీగా పనిచేశారు. మహేష్ బాబు ముల్టీప్లెక్స్ గా చెప్పుకునే ఏఎంబి సెట్టింగ్ కెపాసిటీ 300 వరకు ఉంటుంది అంటే ఒక్కో షో కి వసూలు చేస్తే మొత్తం ఆరు లక్షలు ఒక షో తోనే వస్తాయి. బెనిఫిట్ షో కి ప్రత్యేకంగా కట్టాల్సిన టాక్స్ ఏమీ ఉండదు. షో నిర్వాహకులు మొత్తం థియేటర్ బుక్ చేసుకుంటారు. అది కూడా టాక్స్‌తో కలిపే. ఇందులో ఖర్చులు పోగా దాదాపు సగానికి పైగా వారి జేబులో వేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదొక దందాగా మారింది. అభిమానులు ఆ సమయంలో ఏమీ పట్టించుకోరు. సినిమా చూసొచ్చాక టికెట్ రూపంలో మన జేబుకు ఇంత చిల్లు పడిందా అని వాపోతుంటారు.