తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్:
తెలుగు రాష్ట్రాలలో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అదనపు షోలు వేసుకోవడానికి దేవరకు ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది. ఈ మేరకు ఇప్పటికే జీ వోలు కూడా విడుదలయ్యాయి. తెలంగాణలో మిడ్ నైట్ ఒంటిగంట నుంచి షోలు పడనున్నాయి. మొత్తంగా 20 కు పైగా థియేటర్లో బెనిఫిట్ షోలు వేస్తున్నారు ఉదయం 4 గంటల నుంచి రెగ్యులర్ షోలు పడనున్నాయి. అటు ఏపీలోనూ ఇదే సంగతి. ఇదే క్రమంలో తొలిరోజు రూ.65 కోట్లకు పైగా గ్రాస్ రావచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఇక ఇతర రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, తమిళనాడులో కూడా అడ్వాన్స్ బుకింగ్ చాలా బాగుంది. ఈ మూడు రాష్ట్రాల నుంచే మొత్తంగా రూ.20 కోట్లకు పైగా కలెక్షన్ వచ్చే అవకాశం ఉన్నాయని కూడా అంటున్నారు. నార్త్ ఇండియా నుంచి కూడా పది కోట్లకు పైగా వస్తాయని అంచనా. మొత్తంగా తొలిరోజు దేవర రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.
ఇతర దేశాల్లో కూడా దేవర రికార్డులు సృష్టిస్తుంది. ఎన్టీఆర్ దూకుడు ఫ్రీ సేల్స్ ఓపెన్ అయినప్పటి నుంచే మొదలయింది. ఆ క్రేజ్‌కు అక్కడ ఏకంగా 2.5 మిలియన్ డాలర్స్ కంటే ఎక్కువ రాబట్టింది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.20 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్ విడుదలకు ముందే దేవర రాబట్టింది. ఇక ఇప్పుడు మూవీ క్రేజ్ పిక్స్ లో ఉండటంతో ఓవర్సీస్ లోనే కేవలం రూ.50 కోట్లకు పైగా కలెక్షన్ వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. సో ఈ విధంగా ఓపెనింగ్ డేనే దేవర రూ.120 కోట్లకు పైగా కలక్షన్లు వస్తాయి అనేది లెక్క. ఇక మరి దేవరతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలంటే మరి కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.