మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. సెప్టెంబరులో ఈ సినిమాని సెట్స్‌కి తీసుకెళ్లాలని దర్శకుడు రాజమౌళి ప్లాన్‌ చేస్తున్నారట..సాధారణంగా రాజమౌళి సినిమా ప్రారంభం అవుతుందంటే.. అంతకు ముందు కొన్ని నెలల నుంచే ఆ సినిమా హీరో బయట కనిపించడం తగ్గిపోతుంది. హీరో లుక్ రివీల్ అవుతుందని జక్కన్న ఆలోచన. కానీ  SSMB29 మూవీలో మహేశ్ కు మాత్రం ఈ కండిషన్లు లేవు. సూపర్ స్టార్ స్వేచ్ఛంగా ఫంక్షన్లకు, బయటకు తిరుగుతూ ఉన్నాడు. దాంతో ప్రిన్స్ లుక్స్ కి ఫ్యాన్స్ పిచ్చెెక్కిపోతున్నారు. లాంగ్ హెయిర్, గుబురు గడ్డం, మీసకట్టుతో మహేశ్ ను ఇప్పటి వరకు చూడని విధంగా తయ్యారు చేసి  మహేశ్ తో జక్కన్న గట్టిగానే కొట్టబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా రాజమౌళి ప్రిన్స్ లుక్ విషయంలో ట్విస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పుడు మనందరం చూసే మహేశ్ న్యూ లుక్ నిజమైంది కాదట, సినిమాలో వేరే విధంగా కనిపిస్తాడని తెలుస్తోంది.జులపాల జుట్టు, గుబురు గెడ్డం, మీసం పెంచాక ఆ తర్వాత లుక్ కోసం విదేశాల నుంచి హెయిర్ స్టయిలిస్టులను పిలిపించబోతున్నారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న లుక్ మీద ఇతర ఆప్షన్లతో వేరే డిజైన్లు తయారు చేయించే పనిలో రాజమౌళి ఉన్నారని సమాచారం. 

ఇదంతా ఇప్పట్లో అవ్వదు.ఈజీగా మూడు నెలలు సమయం పడుతుంది. అందుకే మహేష్ ఎలాంటి టెన్షన్ లేకుండా తిరిగేస్తున్నాడు.ఇదిలావుంటే  ఇప్పటివరకు గ్లామరస్‌ పాత్రలతో  మిల్క్‌ బాయ్‌లా మెరిసిపోయే లుక్‌లో కనిపించిన మహేశ్‌ పొడవాటి జుట్టు, గడ్డంతో చూపించడం ఎలా? అన్నది ఇంకా జక్కన్న తేల్చుకోలేకపోతున్నారట పొడవైన గడ్డం మహేశ్‌కు సూట్‌ అవ్వడం లేదని అంటున్నారు. దీంతో మహేశ్‌ లుక్‌పై మరిన్ని స్కెచ్‌లు గీస్తున్నట్లే చెబుతున్నారు. మొత్తం ఎనిమిది లుక్స్‌ను జక్కన్న టీమ్‌ రెడీ చేసిందని ఇందులో ఏది ఫైనల్‌ చేస్తారో ఇంకా డిసైడ్‌ చేయలేదని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే ట్రిపుల్‌ ఆర్‌ వంటి చిత్రాలతో టాలీవుడ్‌ను హాలీవుడ్‌ రేంజ్‌కు తీసుకువెళ్లిన జక్కన్న మహేశ్‌ సినిమాపై అస్సలు రాజీ పడటం లేదంటున్నారు. సినిమా కథకు తగ్గ లుక్‌లో మహేశ్‌ను చూపించి ప్రేక్షకులను మెప్పించడం ఎలా అన్నదే జక్కన్న తేల్చుకోలేకపోతున్నారట అందుకే సెప్టెంబర్‌లో సినిమాను సెట్స్‌ పైకి తీసుకువెళ్లిన  మహేశ్‌ బాబుతో షెడ్యూల్‌ ఉంటుందో లేదో ఫైనల్‌ చేయలేదు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాలో మహేశ్‌బాబు లుక్‌పైనే అందరిలో ఆసక్తి కనిపిస్తోంది. మరి జక్కన్న ఎలాంటి స్కెచ్‌ ఫైనల్‌ చేస్తారో చూడాల్సివుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: