నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఈ నటుడిని అరెస్టు చేసింది. డ్రగ్స్ కేసులో నిందితుడుగా ఉన్న ఈ అభిషేక్ ను కోర్టు కేసులో హాజరు కాకపోవడంతో తాజాగా అరెస్ట్ వారెంట్ జారీ చేశారట. దీంతో అభిషేక్ రాష్ట్రం నుంచి పారిపోయి ప్రస్తుతం గోవాలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే అక్కడికి ప్రత్యేకమైన బృందం వెళ్లి మరి అభిషేక్ ని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. సీసీఎస్ కి తరలించిన అనంతరం అభిషేక్ ని కోర్టు ముందుకి హాజరు పరచబోతున్నారట నార్కోటిక్ అధికారులు.
ఇక నటుడు అభిషేక్ కూడా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో కూడా విలన్ పాత్రలో నటించారు. అలాగే పలు చిత్రాలలో కూడా సైడ్ క్యారెక్టర్లలో కూడా నటించిన అభిషేక్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో సినిమాల నుంచి దూరమయ్యారు. 2012లో డిసెంబర్ నెలలో అభిషేకమైన డ్రగ్స్ ఆరోపణలు వినిపించాయి. ఈ తనిఖీలో 10 ప్యాకెట్ల కొకైన్ తో పట్టుబడిన అభిషేక్ తో పాటు నవీన్, శ్రీనివాస్ అనే ఇద్దరు పేర్లు కూడా అధికారులు గుర్తించారట.అప్పట్లో ఈ కేసు ఒక సంచలనంగా మారింది. అయితే ఆ డ్రగ్స్ డ్రగ్స్ దక్షిణాఫ్రికా నుంచి ముంబైకి తరలిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి పంపిణీ జరుగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారట. ఈ రోజున నటుడు అభిషేక్ ని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.