ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో మరొకసారి నటించబోతున్నారు. ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ సోలోగా దేవర సినిమాతో వస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ పెద్ద పాత్రలో శృతి మరాఠీ నటిస్తూ ఉండగా రెండవ ఎన్టీఆర్ కీ జోడిగా జాన్వీ కపూర్ నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ప్లీజ్ బిజినెస్ లో కూడా ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నాయి దేవర సినిమా అడ్వాన్స్ బుకింగ్ లో కూడా సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. అలాగే ఇతర దేశాలలో కూడా దేవర సినిమా హవ కొనసాగుతూనే ఉంది.
మరి కొన్ని గంటలలో థియేటర్లో సందడి చేయబోతున్న దేవర సినిమా కోసం అభిమానులు ఇప్పటి నుంచే థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. రూ .500 కోట్ల రూపాయల టార్గెట్ తో ఈ సినిమాని బరిలోకి దించబోతున్నారు. డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాతో తన కెరియర్ మరొకసారి మలుపు తిరుగుతుందని కూడా అభిమానులు భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఆయుధపూజ సాంగైతే అందరిని ఆకట్టుకుంటోంది. మరి టాక్ పరంగా ఎలాంటి టాక్ సంపాదించుకొని మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ను రాబడుతుందో చూడాలి.