మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'దేవర' మరికొన్ని గంటలో థియేటర్లలో సందడి చేయబోతోంది.ఈ నేపథ్యంలోనే మూవీ హిట్ కావాలని కోరుకుంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తారక్ కు స్పెషల్ గా పోస్ట్ చేశారు. చెర్రీ స్పెషల్ పోస్ట్ లో ఏముందో చూద్దాం పదండి.యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ డ్రామా 'దేవర'. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగు తెరపై అడుగు పెట్టబోతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ మూవీని నిర్మించగా, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 27న మూవీ భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. అంటే మరికొన్ని గంటల్లో 'దేవర' మాస్ ఫెస్ట్ థియేటర్లలో ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలు తెప్పించబోతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ మూవీ గురించే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ కు క్లోజ్ ఫ్రెండ్ అయిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా స్పెషల్  పోస్ట్చేస్తూ 'దేవర' మూవీ హిట్ కావాలని కోరుకున్నారు. ఈ మేరకు చెర్రీ "రేపు దేవర మూవీ రిలీజ్ కాబోతున్న సందర్భంగా నా బ్రదర్ తారక్ తో పాటు దేవర టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్" అంటూ పోస్ట్  చేశారు. ఇక ఇద్దరు హీరోల మధ్య ఉన్న బాండింగ్ ఎలాంటిదో తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. 

గతంలో వీరిద్దరూ కలిసి 'ఆర్ఆర్ఆర్' సినిమాలో చేసిన రామ్, భీమ్ పాత్రలను ఎప్పటికీ మర్చిపోలేము. ఈ సినిమాలోనే కాదు రియల్ లైఫ్ లో కూడా చెర్రీ, తారక్ ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఇద్దరూ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేశారు. ఆ మూవీ తర్వాత తారక్ చేస్తున్న ఫస్ట్ మూవీ ఇదే కావడం విశేషం. మరోవైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీకి కమిట్ అయ్యారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ డిసెంబర్ 20న థియేటర్లలోకి రాబోతోంది. గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేసిన తర్వాత అందులో తారక్ పాత్ర తక్కువగా ఉందని, రామ్ చరణ్ పాత్రలో ఎక్కువ చేసి చూపించారంటూ ఇరువురు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో కొట్టుకున్నారు. కానీ రేపు 'దేవర' రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో చెర్రీ స్వయంగా తారక్ కు విష్ చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి అవ్వడమే కాకుండా చెర్రీకి థాంక్స్ చెబుతున్నారు. ఇక చెర్రీ చేసినపోస్ట్ వల్ల కలిగే మరో ఉపయోగం ఏమిటంటే దేవర మూవీపై మెగా ఫ్యాన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే బటర్ ఫ్లై ఎఫెక్ట్ లాగా ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు చెర్రీ చేసిన సపోర్ట్ ను గుర్తు పెట్టుకొని మరీ గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ అయినప్పుడు మూవీ హిట్ కావడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడైతే 'దేవర' మూవీ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: