కొరటాల శివ దర్శకత్వంలో,  ఎన్టీఆర్ హీరోగా , బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తొలిసారి తెలుగు తెరకు పరిచయం కాబోతున్న చిత్రం దేవర. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా నటిస్తున్నారు. దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ సినిమా మంచి వినోదాన్ని పంచుతోందని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు దేవర  సినిమా పిచ్చితో ఊగిపోతున్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే ఇక పెద్ద పండగ అని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా సరే ఎన్టీఆర్ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పాలాభిషేకాలే కాదు రక్తాభిషేకం చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.

ఇకపోతే సినిమా మిడ్ నైట్ నుండే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక సినిమా చూడడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని మరీ టికెట్టు తీసుకుని సినిమా చూడడానికి సిద్ధమైపోయారు. సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియన్స్ అసలు ఈ సినిమాపై ఎలాంటి కామెంట్లు చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. సినిమా చూసి అభిమానులు కాలర్ ఎగరేసుకుంటూ బయటికి వచ్చే విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే అభిమానులు కాకుండా పబ్లిక్ టాక్ ఎలా ఉందనే విషయాన్ని కొస్తే ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ మాత్రం చించిపడేశారని, ఫస్ట్ హాఫ్ కొంత డల్ గా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు.


ముఖ్యంగా ఇలాంటి క్లైమాక్స్ ను ఎవరు ఊహించలేదని,  బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ అరిచి మరీ గోల చేస్తున్నారు ఆడియన్స్. ఇక రాజమౌళి సినిమా తర్వాత హీరోలకు ఫ్లాప్ వస్తుందని అందరూ అంటారు కదా.. కానీ ఈ విషయంలో ఎన్టీఆర్ బ్రేక్ చేశారని , ఎన్టీఆర్ఒక లెవెల్ లో నటించారని.. ముఖ్యంగా ఈ సినిమా ఎన్టీఆర్ కోసమైనా సరే చూడొచ్చు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే దేవర పార్ట్ 2 లో అసలు సినిమా ఉండొచ్చని కొంతమంది అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మొత్తానికైతే దేవర మొదటి భాగంలో దేవర ప్రపంచాన్ని పరిచయం చేశారు  సెకండ్ హాఫ్ పీక్స్ లో తీసుకెళ్తారని పబ్లిక్ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: